18 ఏళ్లు నిండిన వారికి టీకా...సాయంత్రం 4 నుండి రిజిస్ట్రేషన్ !

Update: 2021-04-28 06:30 GMT
దేశంలో ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ చుక్కలు చూపిస్తుంటే .. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 45 ఏళ్ళు నిండిన వ్యక్తులకు వ్యాక్సిన్ అందిస్తూ వస్తున్నారు.  కాగా, మే 1 వ తేదీ నుంచి 18 ఏళ్ళు నిండిన వారికి వ్యాక్సిన్ అందించే కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆరంభమౌతుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవడానికి అర్హులు. తమ పేరు, ఇతర వివరాలను నమోదు చేయించుకున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తారు.

కాగా, ఈ వ్యాక్సిన్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆసుపత్రుల్లోనే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వ్యాక్సిన్ అందించబోతున్నారు.  ఇప్పటికే అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్ ఫ్రీ అని  ప్రకటించాయి.  ఉత్పత్తి దారుల నుంచి పెద్ద ఎత్తున వ్యాక్సిన్ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంటున్నాయి.  అటు కేంద్రం కూడా కొనుగోలు చేసిన వ్యాక్సిన్ ను రాష్ట్రాలకు ఉచితంగా అందించబోతున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హులైన ప్రతి ఒక్కరూ ముందుగా తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న http://cowin.gov.in వెబ్‌ సైట్‌ తో మరో రెండు సౌకర్యాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఆరోగ్యసేతు, ఉమంగ్ యాప్‌ ల ద్వారా కూడా అర్హులు తమ పేర్లు, ఇతర వివరాలను నమోదు చేయించుకునే వెసలుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. తాము నివసిస్తోన్న ప్రదేశానికి సమీపంలో ఉండే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వివరాలను తెలుసుకోవచ్చు. టైమ్ స్లాట్ తీసుకోవడం ద్వారా అందులో నిర్దేశించిన సమయానికి ఆసుపత్రి లేదా ప్రాథమిక ఆరోగ్యం కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ రెండో విడత డోసును ఎప్పుడు తీసుకోవాలనేది కూడా తెలుసుకోవచ్చు. అయితే , చాలా రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరత చాలా ఎక్కువగా ఉంది. ఏపీ, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఛత్తీస్‌ గఢ్, జార్ఖండ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో టీకాల కొరత నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో మే 1వ తేదీ నుంచి 18 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం వివాదాలకు దారి తీస్తోంది.

 కాగా దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 17,23,912 కరోనా పరీక్షలు చేయగా.. 3,60,960 కేసులు బయటపడ్డాయి. దీనితో మొత్తం కేసులు సంఖ్య 1,79,97,267కి చేరింది. అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో 3,293 మంది మృతి చెందారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 2,01,187గా నమోదయ్యాయి. ఇక కరోనా నుంచి ఒక్కరోజులోనే 2,61,162మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 29,78,709 యాక్టివ్ కేసులున్నాయి .
Tags:    

Similar News