కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కార్తీక వన మహోత్సవాల్లో ఖమ్మం జిల్లాకు చెందిన ఒక నేత(మల్లాది వాసు) ఏపీ మంత్రి కొడాలి నాని.. వల్లభనేని వంశీలను నిర్మూలించేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. అందుకు రూ.50 లక్షలు ఇచ్చేందుకు తాను రెఢీ అంటూ చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి వైరల్ గా మారటం.. పెను సంచలనానికి తెర తీయటం తెలిసిందే. దీనిపై తాజాగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు.
నిజానికి ఈ రచ్చ మొత్తానికి కారణమైన తన వ్యాఖ్యల విషయంలో పశ్చాతాపాన్ని ప్రకటించటం గమనార్హం. ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి తాను అన్న మాటల్లో ఒక పదం తప్పుగా దొర్లిందని.. దానికి తాను బాధ పడుతున్నట్లు పేర్కొన్నారు. తాను ఎంతో అభిమానంతో నారా భువనేశ్వరిని అక్కా అని పిలుస్తానని.. అలాంటి ఆమెను అన్న మాటకు తాను బాధ పడుతున్నట్లుగా వెల్లడించారు. అదే సమయంలో ఏపీ మంత్రి కొడాలి నాని.. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో పాటు.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై దాడి చేసిన వారికి రూ.50 లక్షల రివార్డు ఇస్తానంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత ఒకరు చేసిన వ్యాఖ్యపై వల్లభనేని వంశీ స్పందించారు.
కొడాలి నాని.. తనను కమ్మ కులం నుంచి వెలివేయాలనుకుంటున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు. శేరిలింగంపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఎమ్మెల్యేనా? కుల సంఘానికి నాయకుడా? అని వంశీ మండిపడ్డారు. వీళ్లంతా ఆస్తులు పెంచుకోవటానికే పార్టీలు మారినట్లుగా ఆరోపించారు. టీఆర్ఎస్ నేత మల్లాది వాసు వెనుక ఉన్నది..ఆ మాటల్ని అనిపించింది చంద్రబాబు నాయుడేనని వ్యాఖ్యానించారు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రత్యేకంగా ఒక కులం కోసం ఏర్పాటు చేయలేదన్నారు. పేద.. వెనుకబడిన కులాల వారిని ఆదుకోవటం కోసం.. వారి బతుకులు బాగు చేయటం కోసం పార్టీని ఏర్పాటు చేశారని.. అలాంటి పార్టీలోకి వచ్చిన చంద్రబాబు ఒక చీడపురుగా మారారని మండిపడ్డారు.
పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతికి వచ్చిన తర్వాత ఒక కులానికి ప్రాధాన్యత ఇవ్వటం మొదలు పెట్టారన్నారు. కుట్రలు పన్నడం చంద్రబాబుకు అలవాటన్నారు. 'చంద్రబాబు ఉండగా కమ్మ కులం బాగుపడదు. ఈ కులంలో ఎంతో మంది మేధావులు.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు ఉన్నారు. ఈ కులానికి చంద్రబాబో.. తానో.. కొడాలి నానో మొదలు కాదు.. చివర కాదు. తనతో పెట్టుకున్న వాళ్లు బతకలేదని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే ఇటీవల చంద్రబాబు బెదిరించారు. నేను 15-16 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఎనిమిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా. ఎంతో మంది బలమైన ప్రత్యర్థులతో పోరాడా. బెదిరింపులకు భయపడేది లేదు' అని స్పష్టం చేశారు.
తాను.. కొడాలి నాని ఎన్నో తాటాకు చప్పుళ్లకు.. ఉడత ఊపులకు.. పిచ్చి వాగుళ్లను పట్టించుకోమని.. అలాంటి వాటికి భయపడేది లేదన్నారు. ఎవడేం చేస్తాడో చూద్దాం.. ఎవడేం చేయగలడో కూడా తేలుతుందని సవాలు విసిరారు. తమకు సవాలు విసిరిన వాడు.. వాడిని వాడు తేల్చుకోవాల్సి ఉంటుందని ఫైర్ అయ్యారు. తాము బలమైన ప్రత్యర్థులతో పోరాడామని.. తాము దేనినైనా ఫేస్ చేయటానికైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.