టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ అధినేత జగన్ కు జైకొట్టిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో మాత్రం అధికారికంగా చేరలేదు. అయితే అసెంబ్లీలో ప్రత్యేకమైన ఎమ్మెల్యేగానే ఉంటూ అసెంబ్లీలో టీడీపీ స్థానాల వెనుకాల కూర్చుంటున్నారు. టీడీపీ వెనుకాలే ఉంటూ ఆ పార్టీనే తిట్టిపోస్తున్నారు.
అయితే తాజా అసెంబ్లీ సమావేశాల్లో రెండోరోజు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి ఆశ్చర్యపరిచాడు. మంగళవారం అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలకు కేటాయించిన సీట్లలో కూర్చొని టీడీపీకి షాక్ ఇచ్చాడు. వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ పక్క సీట్లో కూర్చొని ఆయనతో ముచ్చటించారు.
అలాగే టీడీపీ ఎమ్మెల్యేలంతా పోడియం దగ్గర నిరసన తెలుపుతున్న సమయంలోనూ వంశీ దూరంగా ఉండి వారికి వ్యతిరేకంగా కూర్చున్నారు.
సోమవారం 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా వంశీ టీడీపీ కి కేటాయించిన సీట్లలో చివరి వరుసలో కూర్చున్నారు.ఆయన పక్కన ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే మద్దాల గిరి కూర్చున్నారు. రెండో రోజు మాత్రం వంశీ వైసీపీ ఎమ్మెల్యేల పక్కన కూర్చోవడం విశేషం.