వైసీపీ గేమ్‌లో వంశీ ఒంట‌ర‌య్యాడుగా!

Update: 2021-12-04 23:30 GMT
ఏదేమైనా.. ఏపీలో ఫ‌క్తు రాజ‌కీయాలు క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలోనే చిత్ర‌మైన రాజ‌కీయాలు చోటు చేసుకుంటున్నాయి. అదేంటంటే..త‌మ‌కు అనుకూలంగా ఉన్నంత వ‌ర‌కు త‌మ వారిగా చూస్తున్న వైసీపీ ... త‌మ‌కు సెగ మొద‌లైంద‌ని అనుకోగానే.. నేత‌ల‌ను బ‌య‌ట‌కు గెంటేసేందుకు కూడా సిద్ధ‌మ‌నే సంకేతాలు ఇస్తోంది. తాగా అసెంబ్లీలో చంద్ర‌బాబును అవ‌మానించిన ఘ‌ట‌న‌, ముఖ్యంగా నంద‌మూరి కుటుంబం ఆడ‌ప‌డుచు.. భువ‌నేశ్వ‌రిని ఘోరంగా దూషించార‌నే కామెంట్ల నేప‌థ్యంలో అటు ప్ర‌తిప‌క్షానికి, ఇటు అధికార ప‌క్షానికి మ‌ధ్య తీవ్ర వాగ్యుద్ధం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న వల్ల‌భ‌నేని వంశీ విష‌యం ఇప్పుడు యూట‌ర్న్ తీసుకుంది. గ‌తంలో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన ఆయ‌న‌.. కొన్నాళ్లుగా వైసీపీకి మ‌ద్ద‌తు దారుగా ఉన్నారు. పార్టీ మారిక‌పోయినా.. వైసీపీ కండువా క‌ప్పుకోక‌పోయినా.. టీడీపీ నేత‌ల‌ను విమ‌ర్శిస్తున్నారు. ముఖ్యంగా చంద్ర‌బాబుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే.. ఈ క్ర‌మంలోనే కొన్నాళ్ల కింద‌ట భువ‌నేశ్వ‌రిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇవే అసెంబ్లీ వ‌ర‌కు పాకి.. తీవ్ర వివాదానికి దారి తీశాయి. వైసీపీ ఎమ్మెల్యేలు.. చంద్ర‌బాబు స‌తీమ‌ణిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసేలా.. దూషించేలా.. దారి తీశాయి.

అయితే.. ఇప్పుడు ఈ వివాదాన్ని .. టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. గ్రామ‌స్థాయికి తీసుకువెళ్లారు. క్షేత్ర‌స్థాయిలో మ‌హిళ‌ల‌ను క‌ద‌లించారు. నంద‌మూరి కుటుంబానికి జ‌రిగిన అవ‌మాన‌మే కాదు.. ఈ రాష్ట్రంలో మ‌హిళ‌ల విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం చేస్తున్న అగౌర‌వ కృత్యంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఇది బాగా క్షేత్ర‌స్థాయిలోకి వెళ్ల‌డం.. వైసీపీప వ్య‌తిరేక‌త వ‌స్తున్న‌ట్టు తెలియ‌డంతో.. వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు యూట‌ర్న్ తీసుకున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌మ వాడుగా.. త‌మకు మ‌ద్ద‌తు ఇస్తున్న ఎమ్మెల్యేగా చూసిన‌.. వల్ల‌భ‌నేని వంశీని ఇప్పుడు టీడీపీ నేత‌గా.. టీడీపీ ఎమ్మెల్యేగా ప్రొజెక్టు చేయ‌డంలోదూకుడు గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తాజాగా క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, వైసీపీ నాయ‌కులు, జ‌గ‌న్‌కు ఆత్మీయుడు.. రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి.. చేసిన వ్యాఖ్య‌లు.. వైసీపీకి మ‌ద్ద‌తిస్తున్న వంశీ స్థాయి ఏంటో చెప్ప‌క‌నే చెప్పాయి. ``టీడీపీ ఎమ్మెల్యే ఒక‌రు చేసిన వ్యాఖ్య‌ల‌ను మాకు అంట‌గ‌డితే ఎలా? `` అని ఆయ‌న వ్యాఖ్యానించారు. అంటే.. నిన్న‌టి వ‌ర‌కు త‌మ‌కు అనుకూలంగా ఉన్న వంశీని.. ఇప్పుడు ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చే స‌రికి.. ప‌క్క‌కు తోసేయ‌డం.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీసింది. వైసీపీ గేమ్‌లో వంశీ ఒంట‌ర‌య్యాడుగా! అనే కామెంట్లు నెటిజ‌న్ల నుంచి జోరుగా వినిపిస్తున్నాయి. మ‌రి దీనిపై వంశీ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
Tags:    

Similar News