పార్టీ కోసం నమ్ముకున్న వారి కోసం ఎంతకైనా పోరాడతాం. వారి కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధం.. ఇలాంటి మాటలు టీడీపీ అధినేత చంద్రబాబు నోటి నుంచి తరచూ వస్తుంటాయి. మరి.. అలాంటి వ్యక్తి తన పార్టీకి చెందిన వారికి ఏదైనా కష్టం వస్తే ఎలా రియాక్ట్ అవుతారు? అన్నది చూసినప్పుడు ఆశ్చర్యమనిపించక మానదు. ఎందుకంటే.. ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు పార్టీ కోసం పోరాడిన దానికి జైలు పాలు అయితే.. ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోలేదన్న విమర్శ సొంత తమ్ముళ్లే చేస్తున్న పరిస్థితి.
తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు చిరాకు పుట్టించేలా వ్యాఖ్యలు చేయటంతో పాటు.. తన తీరుతో ఇబ్బంది కలిగించేసత్తా ఉన్న తెలుగుదేశం నేతల్లో వంటేరు ప్రతాపరెడ్డి ఒకరు. ఆ మధ్యన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓయూ విద్యార్థుల తరఫున ప్రభుత్వంపై కోట్లాటకు ఆయన ఓయూకు వెళ్లిన సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.
ఈ ఎపిసోడ్ లో వంటేరు ఎపిసోడ్ లో చట్టం ఎంత కరకుగా వ్యవహరించిందన్నది ఒక ఎత్తు అయితే.. ఒక చిన్న కేసులో రోజుల తరబడి జైల్లో ఉండాల్సి రావటం.. అది కూడా రాష్ట్ర స్థాయి నాయకుడు కావటంపై పార్టీలోనూ.. తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరిగింది. పార్టీ కోసం పోరాడుతున్న వంటేరు విషయంలో ఆయనకు తీవ్రమైన అన్యాయం జరిగిందని..తెలంగాణ ప్రభుత్వం కత్తి కట్టిందన్న మాటను చంద్రబాబు నోటి నుంచి ఒక్కసారిగా రాకపోవటంపై తెలుగు తమ్ముళ్లు లోగుట్టుగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసేవారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడి హోదాలో ఉన్న నేతను తెలంగాణ ప్రభుత్వం జైలుకు పంపి.. రోజుల తరబడి ఉంచితే.. పార్టీ అధినేత హోదాలో బాబు తీవ్రమైన ప్రకటన చేయకపోవటాన్ని పలువురు ప్రస్తావిస్తారు. తాజాగా హైదరాబాద్ లో రెండు రోజులుగా పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లతో భేటీ అయిన నేపథ్యంలో అయినా.. వంటేరును ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడితే బాగుండేదని చెబుతున్నారు.
చివరకు వంటేరే బాబును కలిసి తనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరటం చూస్తే.. పార్టీ కోసం పోరాటం చేసే వారి విషయంలో బాబు ఏ మాత్రం దన్నుగా ఉన్నారన్నది వంటేరు ఎపిసోడ్ చెప్పకనే చెప్పేస్తుందని చెప్పాలి. కార్యకర్తల సంగతి తర్వాత కనీసం పార్టీ కోసం పోరాడే నేతలకైనా బాబు అండగా నిలిస్తే బాగుంటుందన్న మాట తెలుగు తమ్ముళ్ల నోట రావటం గమనార్హం.