తెలంగాణ తెలుగుదేశం పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగలనుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే...టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు గట్టి ఎదురుదెబ్బ. ఇప్పటికే పార్టీ నామ్‌కేవాస్తీగా తయారైపోయిన పరిస్థితుల్లో....ఆ పార్టీకి మరో ముఖ్యనేత గుడ్ బై చెప్పనున్నారు. అది కూడా పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు మీటింగ్ పెట్టి వారం తీరగకముందే కావడం గమనార్హం. ఇంతకీ ఆ నాయకుడు ఎవరంటే...తెలంగాణ టీడీపీ సీనియర్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి. ఈ నెల 11న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో దేశ రాజధానిలో 'హస్తం' తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల్లో వంటేరు ప్రతాప్ రెడ్డి ఒకరు. పార్టీ అనుబంధ విభాగమైన తెలుగురైతు నాయకుడు కూడా. గత ఎన్నికల్లో గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేసి...గట్టి పోటీ ఇచ్చారు. ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తన సొంత జిల్లా మెదక్ లో నిర్మించ తలపెట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ విషయంలో అరెస్టైన ఆయన్ను తెలుగుదేశం పార్టీ సరిగా గౌరవించలేదని అసంతృప్తి చాలామందిలో ఉంది. దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు గజ్వేల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన నర్సారెడ్డి ఆ తర్వాత టీఆర్ ఎస్ లో చేరారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ లో మంచి నాయకుడి కోసం వెతుకుతున్న కాంగ్రెస్ వంటేరుకు గాలం వేసింది. ఆయనతోపాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారని సమాచారం. వంటేరు చేరికతో బలేపేతం అవుతుందని పలువురు భావిస్తున్నారు. కాగా, ఈ పరిణామం టీడీపీకి కోలుకోలేని దెబ్బ అని అంటున్నారు.