తెలుగుదేశం ఎమ్మెల్సీ నారా లోకేష్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ప్రభాకర్ రెడ్డి అనే ఎన్ఆర్ఐ పై ఫిర్యాదు నమోదు అయ్యింది. తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వర్లరామయ్య ఈమేరకు తాడేపల్లి పోలీసులకు పిర్యాదు చేశారు. లోకేష్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు - దృశ్యాలతో కూడిన పోస్టును పెట్టారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
లోకేష్ వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఆ పోస్టు ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డి న్యూజెర్సీలో ఉంటారని తెలుగుదేశం పార్టీ ఫిర్యాదులో పేర్కొంది. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడని పేర్కొంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను వర్ల రామయ్య కోరారు.
మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలను పోస్టు చేసిన ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యంత తీవ్రమైన అసభ్యకరమైన రాతలతో సీఎం పై అతడు పోస్టు పెట్టాడు.
రవి చౌదరి అనే అకౌంట్ నుంచి అది పోస్ట్ కాగా.. శివరావు అనే వ్యక్తి దాన్ని అనేక మందికి షేర్ చేశాడు. దానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమరావతి ప్రాంతానికి చెందిన శివరావు అనే ఆ తెలుగుదేశం అభిమానిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.