అసెంబ్లీలో చంద్రబాబుకు అవమానం జరిగిందంటూ, సానుభూతి అస్త్రాన్ని పదేపదే ఇంకా ఇంకా వదులుతోంది తెలుగుదేశం. ఏకంగా ఆ పార్టీ నేతలు దీక్షకు సైతం కూర్చున్నారు. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై వైసీపీ నేతలు దుర్భాషలు మాట్లాడారంటూ సాగిన రచ్చ, మరింత కంటిన్యూ అవుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబుపై ఈ విషయాలను పదేపదే ప్రస్తావిస్తున్నారు. మరోవైపు ఆ పార్టీ నేత వర్లరామయ్య ఏకంగా దీక్ష చేపట్టారు. చంద్రబాబు కుటుంబానికి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ దీక్షకు కూర్చున్నారు. ఇదే సందర్బంలో జూనియర్ ఎన్టీఆర్‌పై వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి.
ఇక తాజాగా మంత్రి కొడాలినాని పై వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కొడాలి నానికి తెలుగు నేర్పిన మాస్టర్ వస్తే కాళ్లకు దండం పెట్టాలని ఉందంటూ సెటైర్లు వేసిన ఆయన అలిపిరి బాంబ్ బ్లాస్ట్ తర్వాత కేంద్రం చంద్రబాబుకి ఎన్ ఎస్ జీ సెక్యూరిటీ ఇచ్చింది. చంద్రబాబు దేశ సంపద కాబట్టి కేంద్రం ఎన్ ఎస్ జీతో రక్షణ కల్పించిందన్నారు కానీ, కొడాలి నానిని ఆడవాళ్లు కొట్టకుండా సీఎం జగన్ సెక్యూరిటీ ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. నారా భువనేశ్వరిపై అనవసర వ్యాఖ్యలు చేసినందుకు మహిళల నుంచి కాపాడేందుకు కొడాలి నానికి 1+4 సెక్యూరిటీ పెట్టారంటూ ఫైర్ అయ్యారు.
ఇక, నేను ఓడిపోయినా మంచి పేరు ఉంది.. కొడాలి నాని గెలిచి ఏమి సాధించారు. అంటూ ప్రశ్నించారు వర్ల రామయ్య, చెప్పులు, చీపుర్లతో ప్రజలు కొట్టకుండా పోలీసు రక్షణలో ఉన్న కొడాలి నాని కోసం చంద్రబాబు సెక్యూరిటీ తీసేసి రావాలా, అంటూ నిలదీసిన ఆయన, ఇలాంటి కొడుకుకు జన్మనిచ్చినందుకు కొడాలి నాని తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలే చేయాలని కొడాలి నానిని సీఎం వైఎస్ జగన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు.. కొడాలి నాని ఇకనైనా మనిషిగా బతకడానికి ప్రయత్నించాలంటూ కామెంట్ చేశారు వర్ల రామయ్య.