నిప్పులేనిది పొగ‌రాదుగా చంద్ర‌బాబు

Update: 2018-02-14 17:30 GMT
టీడీపీ పై ఏపీ ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. రాష్ట్రాన్ని ఢిల్లీలో తాక‌ట్టు పెట్టి కేంద్రంతో దోస్తీ చేస్తున్నార‌ని అంటున్నారు. కేంద్ర బ‌డ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జ‌రిగింద‌ని  టీడీపీ నేత‌లు నెత్తీ నోరు బాదుకుంటున్నారు. అదంతా నాణేనికి  ఒక‌వైపే. మ‌రి రెండు వైపు ఏముందంటారా..? 2019 ఎన్నిక‌ల్లో  బీజేపీ - టీడీపీలు క‌లిసి పోటీ చేసి మ‌రోమారు అధికారంలోకి ఎలా రావాలి వ్యూహాలు ర‌చ‌యిస్తున్న‌ట్లు తెలుస్తోంది.  ఏ మాట‌కు ఆ మాట చెప్పుకోవాలి. నిప్పులేనిది పొగ‌రాద‌నే సామెత వినే ఉంటారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ - టీడీపీ క‌లిసి పోటీ చేస్తాయ‌ని ప్ర‌చారం చేస్తుంది ప్ర‌తిప‌క్షాలు అని అనుకుంటే ప‌ప్పులో కాలేసిన‌ట్లే . టీడీపీ - బీజేపీ మిత్ర‌బంధం కొన‌సాగుతుంద‌ని టీడీపీ సీనియ‌ర్ నేత వ‌ర్ల రామ‌య్య స్ప‌ష్టం చేశారు. దీనికి తోడు ఇద్ద‌రం మిత్రుల‌మే కాబ‌ట్టి త‌ప్ప‌కుండా చంద్ర‌బాబు మాట‌ను కేంద్రం తూచా త‌ప్ప‌కుండా పాటిస్తుంద‌ని న‌మ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు.  

అంతేకాదండోయ్ వ‌ర్ల వ్యాఖ్య‌లు అవాస్థ‌వం అంటూ టీడీపీ నేత‌లు బీజేపీ నేత‌ల‌కు సవాల్ విస‌ర‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.  రాష్ట్ర‌ప్ర‌జ‌ల్ని మోసం చేస్తూ తెలుగు త‌మ్ముళ్లు  ప్రభుత్వ లెక్కలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు బహిరంగ చర్చకు సిద్ధమా? అని మాట్లాడ‌డం విడ్డూరంగా ఉంది.

మొత్తానికి చంద్ర‌బాబు రెండో నాలుకుల ధోర‌ణిలోనే ఉన్నారు. ఓ వైపు ఓటుకు నోటు కేసు మరోవైపు ...కేంద్రం ఇచ్చిన నిధుల‌కు లెక్క‌చెప్ప‌లేక బీజేపీ - టీడీపీ ఇద్ద‌రు మిత్రులే అని ప్ర‌జ‌ల‌కు చెప్పేలా టీడీపీ నేత‌ల్ని ఉసిగొల్ప‌డం ఆ పార్టీ స్టాండ్ ఏంటో అర్ధం చేసుకోవ‌చ్చు
Tags:    

Similar News