మళ్లీ మోడీని గుచ్చేసిన వర్మ

Update: 2021-05-02 06:10 GMT
ఎప్పుడూ ఎవరినో ఒకరిని.. ఏదో ఒక విషయంపై కెలికి మరీ వివాదాలు రాజేసే రాంగోపాల్ వర్మ తాజాగా సామాజిక సమస్యలపై స్పందిస్తూ అందరికీ షాకిస్తున్నాడు. సినీ, రాజకీయ ప్రముఖులపై నోరుపారేసుకునే వర్మ ఈసారి బాధ్యతగల భారతీయుడిగా మారి ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తీరు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కు   ఐదు రాష్ట్రాల ఎన్నికలు, కుంభమేళా అని ఇప్పటికే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలపై విమర్శలు గుప్పించిన వివాదాస్పద దర్శకుడు వర్మ తాజాగా మరో అస్త్రం తీశారు.

తాజాగా మోడీ పిలుపునిచ్చిన ‘ఆత్మనిర్భర్ భారత్’పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కరోనా సెకండ్ వేవ్ తో దేశంలో ఆక్సిజన్.. మందులు, వైద్య సామగ్రి కొరతతో ప్రజలు చనిపోతున్న వేళ అమెరికా, రష్యా, బ్రిటన్ సహా పలు దేశాలు విమానాల్లో భారత్ కు ఈ సామగ్రి పంపి సాయం చేశాయి. దీనిపైనే వర్మ సెటైర్ వేశారు..

వర్మ ట్వీట్ చేస్తూ ‘నాదో ప్రశ్న మోడీసార్.. ఈ కరోనా కల్లోల సమయంలో అన్ని దేశాలు భారత్ కష్టాల్లో ఉంటే ఆదుకుంటూ సాయం చేస్తున్నాయి.. మరి మీరు చెప్పిన ఆత్మ నిర్భర్ భారత్ ఇదేనా? అది ఏమైంది?’ అంటూ మోడీపై  సెటైర్లు వేశారు.

 ఆత్మనిర్భర్ అంటే మన దేశ అవసరాలు మనమే తీర్చుకోవాలని పిలుపునిచ్చిన మోడీ.. ఇప్పుడు విదేశాల నుంచి ఎందుకు సాయం తీసుకుంటున్నాడే కోణంలో వర్మ ప్రశ్నలు సంధించారు.
Tags:    

Similar News