స్వలింగ వివాహాలపై ప్రపంచవ్యాప్తంగా ఆమోదం దొరుకుతున్న వేళ వాటికన్ క్యాథలిక్ చర్చి సంచలన ప్రకటన చేసింది. ఇటీవల చాలా దేశాల్లో స్వలింగ వివాహాలకు, బంధాలకు అనుమతులు వస్తున్నాయి. ఈ మేరకు ఆయా దేశాల్లో రాజ్యాంగాలను సైతం సవరిస్తున్నారు. కానీ మత పెద్దలు, ఆధ్యాత్మికవేత్తలు ఇటువంటి వివాహాలను ఆమోదించడం లేదు. అన్ని మతాలు ఇటువంటి వివాహాలు ప్రకృతికి విరుద్ధమని చెబుతున్నాయి. ఈ సందర్భంలో క్యాథలిక్ చర్చి సంచలన ప్రకటన చేసింది. ‘ స్వలింగ వివాహాలు చేసుకోవడం అంటే దేవుడి ఆదేశాలను ధిక్కరించడమే. ఇవి ప్రకృతి విరుద్ధం. ఇటువంటి దిక్కుమాలిన పనులకు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదం తెలపలేం’ అంటూ వాటికన్ చర్చి ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం ఈ ప్రకటన ప్రకంపణలు సృష్టిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో స్వలింగ వివాహాలు, స్వలింక బంధాలపై చర్చలు జరుగుతున్నాయి. చాలా మంది స్వలింగ సంపర్కులు వివాహాలు సైతం చేసుకుంటున్నారు. మేము ఆనందంగా ఉంటున్నామని.. ఇతరులకు ఏ కీడు తలపెట్టడం లేదని.. అటువంటప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే మత పెద్దలు, ఆధ్యాత్మిక గురువులు మాత్రం ఇటువంటి పద్ధతులను ఖరాకండిగా వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాటికన్ చర్చి ఇచ్చిన ప్రకటన సంచలనంగా మారింది. చాలా యూరప్ దేశాలు.. ఆ మాట కొస్తే ప్రపంచంలోని చాలా సంపన్న దేశాల్లో క్రైస్తవుల సంఖ్య ఎక్కువ. ఆయా దేశాలు వాటికన్ చర్చి ఇచ్చిన ప్రకటనను ఎలా స్వీకరిస్తాయో వేచి చూడాలి. ఇప్పటికే పలు మతాలు స్వలింగసంపర్కాన్ని తప్పు అని ప్రకృతి విరుద్ధమని తేల్చిచెప్పాయి.
తాజాగా వాటికన్ చర్చి కూడా అటువంటి ప్రకటన చేయడం గమనార్హం. ‘స్వలింగ వివాహాలు చేసుకొనే జంటలకు మేము ఎట్టిపరిస్థితుల్లోనూ ఆశీస్సులు అందించబోం’ అంటూ వాటికన్ చర్చి తేల్చి చెప్పేసింది. స్వలింగ వివాహం అనేది దేవుడు ఇచ్చిన ఆదేశాలను అనుసరించే జీవిత విధానాన్ని వదిలేసి తీసుకునే నిర్ణయమని పేర్కొంటూ వాటికన్ చర్చి ఓ ప్రకటన విడుదల చేసింది. పోప్ ఫ్రాన్సిస్ ఆమోదం పొందిన ఈ ప్రకటనలో.. స్వలింగ వివాహాలు పాపమని పేర్కొన్నారు.