రెండు రాష్ట్రాల్ని వణికించిన గంధం చెక్కలు.. ఏనుగు దంతాల బందిపోటు. ఎంతోమంది పోలీసుల ప్రాణాల్ని తీసిన కరడుగట్టిన నేరస్తుడు. మరి.. అతగాడి కుమార్తె ఇప్పుడు ఎక్కడ? ఏం చేస్తున్నారన్న విషయాలు కొత్తవేమీ కాకున్నా.. తన గతం గురించి.. తన బాల్యం గురించి.. తన ఆశలు.. ఆవేదనల గురించి ఆమె ఓపెన్ అయ్యారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర బీజేపీ నాయకురాలిగా కీలక బాధ్యతలు వహిస్తున్న ఆమె.. ఇప్పుడు నిరుపేదల తరఫున న్యాయపోరాటం చేసే లాయర్ గా వ్యవహరిస్తున్నారు.
రెండు రాష్ట్ర ప్రభుత్వాల్ని గడగడలాడించిన వ్యక్తి కుమార్తె విద్య. అమ్మమ్మ సంరక్షణలో పెరిగిన ఆమెకు.. అమ్మ.. నాన్న అన్న గురుతులు ఉన్నాయా? అని ప్రశ్నిస్తే ఆమె ముఖం గంభీరమవుతుంది. మిగిలిన పిల్లల బాల్యానికి భిన్నంగా తన చిన్నతనాన్ని ఆమె గుర్తు చేసుకుంటారు. అందరికి అమ్మా..నాన్న ఉంటే.. ఆమెకు మాత్రం అమ్మమ్మ.. తాతయ్యలు మాత్రమే ఉన్నారు. తల్లి ఎలా ఉంటుందో మూడేళ్ల వరకు తెలీదు. ఒకరోజు ఉన్నట్లుండి.. పోలీసుల పహరాలో ఉన్న మహిళను చూపించి.. ఆమే మీ అమ్మ.. వెళ్లి మాట్లాడు అంటే.. ఆ చిన్నారి పడిన మానసిక వేదన ఏమిటన్నది ఆమె మాటల్లో వినిపిస్తూ ఉంటుంది.
‘అదిగో.. మీ అమ్మ అని చూపించారు. అప్పటికి నాకు మూడేళ్లు. తెలిసీ తెలియని వయసులో ముక్కుముఖం తెలీని ఒకామెను చూపించి అమ్మ అంటే ఎలా ఉంటుంది. బాధ.. భయం రెండు కలిగాయి. చుట్టూ పోలీసుల పహరాలో ఆమెను కలిశా. ఆ వయసులో ఒక్కసారి ఏడుపు తన్నుకొచ్చింది. నాకప్పుడు చాక్లెట్లను పోలీసులే కొనిపించారు. బొమ్మలు కూడా ఇచ్చారు. తొలిసారి గోరుముద్దల్ని తిన్నా. తర్వాత అమ్మమ్మతో కలిసి ఊరికి వెళ్లిపోయా’’ అని గతాన్ని గుర్తు చేసుకుంటారు.
ఒకరోజు ఉన్నట్లుండి వెనుక నుంచి ఒక వ్యక్తి వచ్చి తనను పట్టుకున్నారని.. కావేరీ నదీ తీరంలో జరిగిన ఉదంతాన్ని విద్య గుర్తు చేసుకుంటారు. తన తండ్రి వీరప్పన్ అన్న విషయం చిన్నప్పుడు తెలీదని.. కాకుంటే ఒక రోజు ఆడుకునే వేళలో వెనుక నుంచి వచ్చి.. ఒక వ్యక్తి పట్టుకోవటంతో తాను ఏడ్చినట్లుగా గుర్తు చేసుకున్నారు. ‘‘ఏడుస్తూ ఉంటే.. ఏం ఫర్లేదు.. మీ నాన్న అంటూ చెప్పారు. ఆయన్ను చూసి భయపడ్డా. నా ఏడుపు చూసి ఆయన కూడా ఏడవటం మొదలు పెట్టారు. ఆయన ఉన్నంత సేపు నన్ను విడిచి పెట్టలేదు. కిందకు దించకుండా ఎత్తుకొనే ఉన్నారు. పెద్ద అయిన తర్వాత డాక్టర్ కావాలని అని చెప్పి వెళ్లిపోయారు’’ తన తండ్రిని చూడటం అదే తొలిసారి.. చివరిసారిగా అని ఆమె చెప్పారు.
తండ్రి చెప్పినట్లుగా డాక్టర్ కాలేదు. తనకు వైద్యురాలు కావటం కంటే కూడా లాయర్ కావాలనిపించిందని.. అందుకే తాను లాయర్ అయినట్లు చెబుతారు విద్య. మిగిలిన వారికి భిన్నంగా తనకు తల్లిదండ్రులు లేకపోవటం లోటుగా ఉండేదని.. అందుకే దాన్ని అధిగమించటానికి తాను చదువు మీద ఎక్కువ ఫోకస్ పెట్టేదానినని చెప్పారు. బెంగళూరు లా కాలేజీలో చేరే వేళకు తన చేతిలో చిల్లిగవ్వ లేదని.. అయితే.. నాలుగైదు స్కూళ్లలో కమ్యునికేషన్ స్కిల్స్ పాఠాలు చెబుతూ.. అలా వచ్చిన సంపాదనతో తాను లా పూర్తి చేసినట్లు చెబుతారు. ఏమైనా.. ఒక పెద్ద గ్యాంగ్ స్టర్.. అడవి దొంగ కుమార్తె.. అందుకు భిన్నంగా పేదవారికి న్యాయం చేసేందుకు చేసే ప్రయత్నాలు చూసినప్పుడు.. దేవుడి తీర్పు భలే చిత్రంగా ఉంటుందన్న భావన కలుగక మానదు.