నాగబాబుకు ఆ హామీ దక్కిందట ?
మెగా బ్రదర్ జనసేనలో కీలక నాయకుడు అయిన నాగబాబు ఈసారి రాజ్యసభకు వెళ్తారని అంతా అనుకున్నారు.
మెగా బ్రదర్ జనసేనలో కీలక నాయకుడు అయిన నాగబాబు ఈసారి రాజ్యసభకు వెళ్తారని అంతా అనుకున్నారు. రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కాగానే నాగబాబు ఇక ఎంపీ అయినట్లే అని అంతటా ప్రచారం సాగింది. దానికి కారణం నాగాబాబు అనకాపల్లి ఎంపీ టికెట్ ని త్యాగం చేసి ఉండడమే.
అంతే కాదు పవన్ కళ్యాణ్ ఆయన పేరుని తప్పకుండా సిఫార్సు చేస్తారని అలా ఆయనకు తప్పకుండా మూడు ఖాళీలలో ఒకటి దక్కుతుందని లెక్కలేశారు. అయితే చిత్రంగా సీన్ లోకి బీజేపీ వచ్చేసింది. ఆ పార్టీ తరఫున ఆర్ క్రిష్ణయ్య రాజ్యసభకు రెడీ అవుతున్నారు. ఆయన వైసీపీ నుంచి బీజేపీ వైపుగా అడుగులు వేశారని దాని ఫలితంగానే సడెన్ గా రాజీనామా చేశారు అని అంతా చర్చించుకుంటున్నారు.
ఆర్ క్రిష్ణయ్య రాజీనామా చేసినపుడు ఆయన ఇక బీసీ ఉద్యమం వైపే ఉంటారని పార్లమెంట్ కి వెళ్లరని అనుకున్నారు. అయితే అదంతా కాదు అని ఇపుడు అంటున్నారు. సో అలా బీజేపీకి ఒక సీటు వెళ్లడంతో జనసేనకు చాన్స్ రాలేదని అంటున్నారు. ఈ విషయాల మీద పూర్తి అవగాహన ఉన్న మీదటనే నాగబాబు తన నాయకుడు కోసం నిస్వార్ధంగా తాను పనిచేస్తాను అని ఒక ట్వీట్ కూడా చేశారని అంటున్నారు.
అయితే నాగబాబు సేవలను కూటమి పెద్దలు గుర్తించారని ఆయనను నాలుగేళ్ళ రెండేళ్ల కాల వ్యవధిలో ఉండే ఈ ఎంపీ పదవుల కంటే 2026లో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ సీట్లలో పూర్తి కాలం అంటే ఆరేళ్ళ పాటు అధికారంలో ఉండేలా రాజ్యసభకు ఎంపిక చేసి మరీ పంపుతారు అని అంటున్నారు.
ఇక జనసేన అధినాయకత్వం కూడా దీనికి అంగీకరించింది అని అంటున్నారు. మరో వైపు చూస్తే కేంద్రంలో నాగబాబుకు మంత్రి పదవి కోసమే ఈ రాజ్యసభ సీటు అని కూడా అంటున్నారు. బీజేపీ అధినాయకత్వం కేంద్ర మంత్రి వర్గ విస్తరణ కూడా మరో రెండేళ్ళ పాటు ఆగి కానీ చేపట్టదని అంటున్నారు. అది ఆనవాయితీ కూడా అని గుర్తు చేస్తున్నారు.
అందువల్ల ఆనాటికి రాజ్యసభ ఎంపీగా నాగబాబు ఉంటే చాలు అని ఇలా గెలిచి అలా కేంద్ర మంత్రి కూడా అయ్యే చాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. మొత్తం మీద చూస్తే నాగబాబుకు బంపర్ ఆఫర్ మరో రెండేళ్ల వ్యవధిలోనే తగులుతుందని అంటున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలీ అంటే 2026 జూన్ అంటే ఏణ్ణర్ధమే అని కూఒడా లెక్క తీసి చూపిస్తున్నారు. అందువల్లనే నాగబాబు ఈ మూడు సీట్ల విషయంలో పోటీ పడలేదని కూడా చెబుతున్నారు. మొత్తానికి పవన్ లెక్క పక్కాగా ఉంటుందని కూడా అంటున్నారు. సో మెగా బ్రదర్ కి ఉందిలే మంచి కాలం ముందు ముందునా అని జనసైనికులు కూడా అంటున్నారు.