భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఆరోగ్యపరమైన సమస్యల తలెత్తడంతో కుటుంబ సభ్యులు వెంకయ్యనాయుడును ఎయిమ్స్ లో చికిత్స నిమిత్తం చేర్పించగా.. వైద్య బృందం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు తగు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈ రోజు ఎయిమ్స్ లోనే ఉండనున్నారు.
హై బీపీ - షుగర్ లెవల్స్ పెరగడంతో వెంకయ్యనాయుడుకు ఆరోగ్య సమస్యలు ఎదురయినట్లు సమాచారం. దీంతో ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. రొటీన్ చెక్ అప్ కోసమే వెంకయ్య ఎయిమ్స్ లో చేరినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు సోమవారం జైపూర్ లో వెంకయ్యనాయుడు పర్యటించాల్సింది ఉంది. ఆ షెడ్యూల్ లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చునని అధికారులు అంటున్నారు. శనివారం డిశ్చార్జీ చేసే అవకాశం ఉందని సమాచారం.