టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి ఫిరాయిస్తే సభ చైర్మన్ వెంకయ్యనాయుడు వారి ఫిరాయింపును ఆమోదించడం సరికాదని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు చర్చనీయమయ్యాయి. రాజ్యసభ చైర్మన్ గా ఉన్న వెంకయ్యనాయుడు చేసింది ముమ్మాటికీ తప్పేనని సీతారాం స్పష్టం చేశారు. రాజ్యాంగ పరంగా ఉన్నతపదవుల్లో ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన.. దీంతో వెంకయ్యనాయుడు చేసింది తప్పా రైటా అన్న చర్చ మొదలైంది.
నెల రోజుల కిందట రాజ్యసభలో తెలుగుదేశం పార్టీని బీజేపీఎల్పీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఓ లేఖను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు టీడీపీ ఎంపీలు నలుగురు సమర్పించారు. రాజ్యసభ చైర్మన్ కూడా అయిన వెంకయ్యనాయుడు వారి లేఖను ఆమోదించి వారిని బీజేపీ సభ్యులుగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత రాజ్యసభ వెబ్ సైట్ లో కూడా ఈ మేరకు వెనువెంటనే మార్పులు జరిగిపోయాయి. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఓ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ అయిన వారిని మరో పార్టీలో చేర్చుకోవడం - అది కూడా ఉప రాష్ట్రపతి అందుకు ఆమోదం తెలపడం వివాదానికి ఆస్కారం ఇచ్చింది.
ఇది వివాదం కావడానికి కారణం వెంకయ్యనాయుడు గతంలో ఎన్నోసార్లు ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడమే. పార్టీ మారిన రోజునే ఆ ఫిరాయించిన ప్రజాప్రతినిధి పదవి పోవాలని ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు అనేక సార్లు వివిధ వేదికలపై చెప్పారు. అంతేకాదు.. రాజ్యసభ చైర్మన్ హోదాలో పార్టీ మారిన శరద్ యాదవ్ సహా ఇద్దరిని పదవి నుంచి తొలగించారు. కానీ, టీడీపీ రాజ్యసభ సభ్యులు విషయంలో ఆయన అనుసరించిన వైఖరి అందుకు పూర్తిగా బిన్నంగా ఉంది. చెప్పిన మాటలకు చేసిన పనులకు పొంతన లేకపోవడంతో వెంకయ్యనాయుడు విమర్శలకు గురయ్యారు.
ఈ పరిణామలన్నీ గమనిస్తే వెంకయ్యనాయుడు ఆదర్శాల కంటే మోదీ షాల ఆదేశాలే గెలిచాయని.. ఆ ఆదేశాలకు తలొగ్గే వెంకయ్యనాయుడు తన ఆదర్శాలను పక్కనపెట్టారని అర్థమవుతుంది.