పాకిస్థాన్ పేరెత్తితేనే బీజేపీ నేతలు అంతెత్తున ఎగరిపడతారన్న విషయం మనకు తెలిసిందే. మరి వెంకయ్య నోట పాకిస్థాన్ మాట రావడమేమిటి? భారత్ కూడా మరో పాకిస్థాన్ లా మారుతుందంటూ ఆయన వ్యాఖ్యానించడం ఏమిటనేగా మీ డౌటు? వెంకయ్య నోటి నుంచి ఈ మాటైతే వచ్చింది గానీ... అదేదో పాకిస్థాన్ ను కీర్తిస్తూ ఆయన చేసిన వ్యాఖ్య కాదు. అరాచకత్వానికి కేరాఫ్ అడ్రెస్ లా నిలిచిన దేశంగా పాకిస్థాన్ ను అభివర్ణించిన వెంకయ్య... తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్నట్లుగా ముస్లింలకు రిజర్వేషర్లు కల్పిస్తే... భారత్ కూడా పాకిస్థాన్ లానే తయారవుతుందంటూ ఘాటు వ్యాఖ్య చేశారు.
తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే... ముస్లింలకు 12 శాతం మేర రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల నాడు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగిశాయి... కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. మూడేళ్లు ఇట్టే గిర్రున తిరిగాయి. మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మొన్న మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్... ఇచ్చిన హామీ మేరకు ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దీనిపై తాము తీర్మానం చేసి పంపుతామని, కేంద్రం కూడా దానికి సానుకూలంగా స్పందించాల్సిందేనని, లేని పక్షంలో మోదీ సర్కారుతో మరో యుద్ధానికి కూడా వెనుకాడబోమని ఆయన సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు జనమంతా దీనిపైనే చర్చించుకుంటున్న వైనం కనిపిస్తోంది.
ఈ క్రమంలో నిన్న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర శాఖ కార్యాలయం వేదికగా జరిగిన కార్యక్రమానికి వెంకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య... కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్ల ప్రకటనకు వ్యతిరేకంగా ఆసక్తికర కామెంట్లు చేశారు. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ వైఖరిని చెప్పిన వెంకయ్య... ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తే... భారత్ మరో పాకిస్థాన్ లా తయారవుతుందని కూడా డేంజర్ బెల్స్ మోగించారు. ముస్లిం రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని, గతంలో వైఎస్సార్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నప్పుడూ తమ పార్టీ వ్యతిరేకించిందని ఆయన గుర్తు చేశారు. మతపరమైన రిజర్వేషన్లు సామాజిక అశాంతికి దారితీస్తాయని... వాటి వల్ల వివిధ వర్గాల ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో పాటు మతమార్పిళ్లను ప్రోత్సహిస్తాయన్నారు.
ఈ తరహా రిజర్వేషన్లను భారత రాజ్యాంగం ఒప్పుకోదని కూడా వెంకయ్య వ్యాఖ్యానించారు. ముస్లింలు - క్రిస్టియన్లలో వివక్ష లేదా? మరి రిజర్వేషన్లు ఎందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను అంబేద్కర్ కూడా వ్యతిరేకించారని, మహాత్మా గాంధీ మాతమార్పిళ్లను వ్యతిరేకించారన్నారు. సామాజికంగా - ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ల కల్పనకు బీజేపీ అనుకూలమన్నారు. దళితులు - ముస్లింలలో వెనుకబాటుదనానికి కేంద్రంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన ఆరోపించారు. స్వతంత్ర ఆలోచనలున్న అంబేద్కర్ కు కాంగ్రెస్ ఏనాడు మద్దతివ్వలేదని విమర్శించారు. కుల - మత - ప్రాంత రాజకీయాలకు యూపీ ఎన్నికల ఫలితాలతో కాలం చెల్లిందన్నారు. ప్రజాస్వామ్యం పటిష్టం కావాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా కులవివక్ష పోయి సామాజిక సామరస్యం రావాల్సిన అవసరం ఉందని వెంకయ్య అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/