వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పై కేంద్ర మంత్రి - బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు వ్యంగ్యాస్థ్రాలు సంధించారు. ప్రత్యేక హోదా అంశంపై ఆ పార్టీ అనుసరిస్తున్న తీరును ఎండగడుతూ... ఆ పార్టీ దురుద్దేశాలు తమకు తెలుసన్నట్లుగా పరోక్షంగా కౌంటరేశారు. కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో చేరేందుకు వైసీపీ ఉవ్విళ్లూరుతోందని... కానీ, అది అయ్యేపని కాదని ఆయన ఇండైరెక్టుగా అనేశారు.
ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నుంచి ఎలాగైనా టీడీపీ బయటకు వచ్చేలా చేయడానికి ఒక పార్టీ కోరుతోందని.. టీడీపీ బయటకు వచ్చేస్తే ఆ పార్టీ కేంద్రంలోని ఎన్డీయేలో చేరాలని అనుకుంటోందని వెంకయ్య అంటున్నారు. .కాని గత ఎన్నికలలో మోడీ - బాబు జోడీ అయితేనే ఆంధ్రప్రదేశ్ కు బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడి వారినే గెలిపించారని... అలాంటప్పుడు ఆ జోడీకి బ్రేక్ పడదని వెంకయ్య చెబుతున్నారు. గుంటూరులో వ్యవసాయ యూనివర్శిటీ కి శంకుస్థాపన చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ వైసీపీ రాజకీయ ఎత్తుగడలను - దురుద్దేశాలను ఏకిపడేశారు. రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తున్న పార్టీగా వైసీపీపై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. అయితే... ఎవరికీ భయపడని వెంకయ్య వైసీపీపై డైరెక్టుగా విమర్శలు చేయడానికి ఎందుకు వెనుకాడారన్నది మాత్రం అర్థం కాని ప్రశ్నే. వైసీపీని - జగన్ ను విమర్శించడానికి వెంకయ్యకు ఉన్న భయమేంటో... ఆ పార్టీ పేరు ప్రస్తావించకుండా మాట్లాడడమేంటో మాత్రం తెలియడం లేదని... ఆయన నేరుగా అని ఉంటే ఇంకా బాగుండేదని టీడీపీ వర్గాలు అంటున్నాయి.