కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మరోమారు తన ఆగ్రహాన్ని రుచిచూపించారు. కాకినాడలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ వెంకయ్య నాయుడు తీరుపై మండిపడిన సంగతి తెలిసిందే. ఏపీలో బీజేపీని వెంకయ్యనాయుడు నాశనం చేశారని, హోదా విషయంలో ఆయనే మాత్రం ఏపీ గురించి ఆలోచించలేదని ఫైర్ అయ్యారు. దీనిపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన వెంకయ్య తనపై విమర్శలు చేసిన పవన్ తీరును తప్పుపట్టారు.
దేశంలో ఎవరు ఏదైనా మాట్లాడే వాక్ స్వాతంత్రం ఉందని, అయితే ఇతరుల మనసు నొప్పించే అధికారం లేదని వెంకయ్య నాయుడు అన్నారు. ఏపీకి న్యాయం చేసే విషయంలో తన చిత్త శుద్ధిని ఎవరు ప్రశ్నించలేరని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, తాము ప్రజలకు మాత్రమే సమాధానమిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మించిన సహాయం కేంద్రం చేస్తోందని వెంకయ్య పునరుద్ఘాటించారు. ఇదిలాఉండగా ఢిల్లీ వేదికగా కాకుండా రాష్ట్రంలోనూ తన వాదన వినిపించేందుకు వెంకయ్యనాయుడు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లడనున్నారు. ఈ విలేకరుల సమావేశంలో వెంకయ్య ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ పై ఒకింత దూకుడుగానే వెంకయ్య స్పందించవచ్చని పలువురు భావిస్తున్నారు.