చంద్ర‌బాబు - అప్పులు-కొన్ని చిక్కులు ..!

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు చెబుతున్న అప్పుల లెక్క‌లు ఎలా ఉన్నా.. ఈ చిక్కుల నుంచి త‌ప్పించుకు నేందుకు ఇది స‌రైన మార్గం కాద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Update: 2025-01-29 04:13 GMT

తాజాగా సీఎం చంద్ర‌బాబు అప్పుల గురించి ప్ర‌స్తావించారు. రాష్ట్రంలో వైసీపీ హ‌యాంలో 9 ల‌క్ష‌ల 75వేల కోట్ల రూపాయ‌ల పైచిలుకు మొత్తాన్ని అప్పులు చేశార‌ని.. ఈ సొమ్ములు ఎటు పోయాయో కూడా తెలియ డం లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అంతేకాదు.. వీటికి వ‌డ్డీలు క‌ట్ట‌లేక ఇబ్బందులు ప‌డుతున్నామ‌న్నారు . ఇదే సమ‌యంలో రుణాల‌ను రీషెడ్యూల్ చేయాల‌ని కోరుతున్న‌ట్టు చెప్పారు. వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించాల‌ని కూడా అభ్య‌ర్థిస్తున్నామ‌న్నారు. అయితే.. ఇవ‌న్నీ సాధ్య‌మేనా? అనేది మౌలిక ప్ర‌శ్న‌.

గ‌తంలో అయినా.. ఇప్పుడైనా.. ఒక సంస్థ లేదా బ్యాంకు నుంచి అప్పులు తీసుకున్న‌ప్పుడు.. ముందుగానే ఒప్పందాలు చేసుకుంటారు. వాటి ప్ర‌కార‌మే నిర్ణ‌యాలు ముందుకు సాగుతాయి. ఇప్పుడు అనూహ్యంగా మ‌ధ్య‌లో నిర్ణ‌యాలు మార్చుకుని రుణాల‌ను రీషెడ్యూల్‌(అంటే.. తిరిగి కాల ప‌రిమితిని నిర్ణ‌యించ‌డం. వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించ‌డం) చేయ‌డం అంటే.. ఆర్థికంగా మ‌రో భారం అవుతుంది. పైగా..మ‌రింత కాలం పాటు వ‌డ్డీల‌ను ప్ర‌జ‌లు భ‌రించాల్సి ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు చెబుతున్న అప్పుల లెక్క‌లు ఎలా ఉన్నా.. ఈ చిక్కుల నుంచి త‌ప్పించుకు నేందుకు ఇది స‌రైన మార్గం కాద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వాస్త‌వ అప్పు ఎంత‌? కార్పొరేష న్ల ద్వారా చేసిన అప్పులు ఎన్ని అనేవి లెక్క‌లు ఎప్పుడూ అందుబాటులోనే ఉంట‌యాన కూడా చెబుతున్నారు. వాటిని సాధ్య‌మైనంత వేగంగా తీర్చేందుకు ప్ర‌య‌త్నిస్తే.. కొంత వ‌ర‌కు బ‌య‌ట‌ప‌డ‌డం సాధ్య‌మేన‌ని అంటున్నారు. ఇటీవ‌ల తెలంగాణ‌లోనూ అదే జ‌రిగింద‌ని చెబుతున్నారు.

ఇదే స‌మ‌యంలో కేంద్రం నుంచి అప్పుల రూపంలో కాకుండా.. గ్రాంటుల రూపంలో నిధులు తెచ్చుకు నేందుకు ప్ర‌య‌త్నిస్తే.. అది మరింత‌గా స‌ర్కారుకు దోహ‌ద ప‌డుతుంద‌ని అంటున్నారు. ఇక‌, ఆదాయ వ‌న‌రుల‌ను పెంచుకునే మార్గాలు, సంప‌ద సృష్టి వంటివాటిపై దృష్టి పెట్ట‌డం ద్వారా కూడా.. స‌ర్కారు కొంత వ‌ర‌కు బ‌య‌ట ప‌డేందుకు అవ‌కాశం ల‌భిస్తుంద‌ని చెబుతున్నారు. ఇలా కాకుండా.. రీషెడ్యూల్ చేయ‌డం అంటే.. మ‌రింత భారం మోయ‌డ‌మేన‌ని అంటున్నారు. అంతేకాదు.. ఈ నిర్ణ‌యంతో రాజ‌కీయంగా కూడా.. ఇబ్బందులు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని సూచిస్తున్నారు.

Tags:    

Similar News