మంచి వాగ్ధాటి ఉన్న ఇరు పక్షాల మధ్య వాదన జరిగితే ఎలా ఉంటుంది? తాజాగా అలాంటి చిత్రమే బుధవారం లోక్ సభలో బీజేపీ.. టీఆర్ఎస్ ల మధ్య చోటు చేసుకుంది. తమ డిమాండ్ల సాధనకు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా వ్యవహరించటమే కాదు.. తమ వాదనతో ఉక్కిరిబిక్కిరి చేయటం వారికి అలవాటే.
అదే రీతిలో తెలంగాణలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలన్న అంశంపై పార్లమెంటు సమావేశాల్లో నిత్యం ఆందోళన చేస్తున్న టీఆర్ ఎస్ ఎంపీల అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా టీఆర్ ఎస్ ఎంపీలు తమ వాదనను బలంగా వినిపించారు. దీనికి సమాధానం ఇచ్చేందుకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రయత్నించారు.
విభజన చట్టంలో ప్రత్యేక హైకోర్టు గురించి స్పష్టంగా పేర్కొన్నారని.. దాన్ని తప్పకుండా నెరవేరుస్తామని మంగళవారమే చెప్పటం.. దానికి కొనసాగింపుగా బుధవారం న్యాయశాఖామంత్రి వివరణ ఇవ్వటం.. దానిపై టీఆర్ ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయటం లాంటివి వరుసగా సాగిపోవటం తెలిసిందే. టీఆర్ ఎస్ నేతల ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం వెంకయ్య చేస్తుండగా.. ఆయన ప్రసంగానికి గులాబీదళం అడ్డుపడటం.. పద్నాలుగు నెలలుగా ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదంటూ ప్రశ్నించటంతో వెంకయ్యకు చిరాకెత్తింది.
అంతే.. గులాబీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకయ్య.. తాను చెప్పేది వినేందుకు ఓపిక లేకపోతే.. తానీ అంశాన్ని ఇక్కడే వదిలేస్తానని.. తమ మంత్రి ప్రకటనను కూడా ఉపసంహరించుకోమని సూచిస్తానని చెప్పేశారు. అంతేకాదు.. టీఆర్ ఎస్ ఎంపీలు ఏం చేసుకుంటారో చేసుకోవాలంటూ తీవ్రస్వరంగా మండిపడ్డారు.
పద్నాలుగు నెలల్లో హామీని ఎందుకు పూర్తి చేయలేదని అడుగుతున్నారని.. టీఆర్ ఎస్ పార్టీ కూడా ఎన్నికల సమయంలో ఎన్నో హామీల్ని ఇచ్చిందని.. గత 14 నెలల్లో వాటిని ఎందుకు అమలు చేయలేదని ప్రజలు అడుగుతున్నారని.. దీనికి ఏం సమాధానం చెబుతారంటూ మండిపడటంతో టీఆర్ ఎస్ నేతల నోటి నుంచి సౌండ్ రాని పరిస్థితి. వేలెత్తి చూపించే ముందు.. మిగిలినవి మనవైపు చూపిస్తాయన్న సామెతను చేతల్లో చూపించటమే కాదు.. ఇంతకాలం తమకు పంచ్ మీద పంచ్ ఇస్తున్న టీఆర్ ఎస్ ఎంపీలకు వెంకయ్య తాజాగా పంచ్ ఇచ్చినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది.