బీజేపీ నేత - కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాటల మాంత్రికుడు అనే సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అలా వ్యాఖ్యానించడంలో తిమ్మిని బమ్మి చేయడం - కాస్త అతి విశ్లేషణ కూడా వెంక్యయ శైలి అని కొందరు అంటుంటారు. తాజాగా ఆయన ఏపీ గురించి, తమ ప్రభుత్వం గురించి ఇదేమాట చెప్తున్నారు. విశాఖలో నిర్వహించిన బీజేపీ విజయోత్సవ ర్యాలీ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగించారు. సందర్భం - అవకాశం దొరికిన ప్రతీసారి ఆంధ్రప్రదేశ్ కు మేలు చేకూర్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నామని తెలిపారు. తన 40ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఒక రాష్ట్రానికి ఇంత భారీ మొత్తంలో ప్రాజెక్టులు కేటాయించడం ఎన్నడూ చూడలేదని వెంకయ్య అన్నారు. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు అందించిన సహాయం విషయంలో చరిత్ర ఎప్పటికీ తనను గుర్తుపెట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు.
ఏపీకి ఏం కావాలో పార్లమెంట్ లో అడిగిన వ్యక్తిని తానొక్కడినేనని వెంకయ్యనాయుడు అన్నారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి కేంద్రం చేసిన పలు సహాయాల గురించి వెంకయ్య వివరించారు. ఆంధ్రప్రదేశ్ కు 950 మెడికల్ సీట్లు కేంద్రం అదనంగా ఇచ్చిందని, రాష్ట్రానికి 2500మెగావాట్ల సామర్థ్యం గల రెండు సోలార్ ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసిందని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం రూ.3వేల కోట్లకు పైగా నిధులిచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో 1.93లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని చెప్పుకొచ్చారు. విశాఖకు త్వరలోనే రైల్వేజోన్ వస్తుందని భరోసా ఇచ్చారు. విభజన అంశాలపై ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ఏం చేశారని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/