శుక్రవారం విడుదలైన శ్రీమంతుడు సినిమాలో ఒక డైలాగ్ జనాల్ని బాగా ఆకట్టుకుంటోంది. అన్ని ఇచ్చిన ఊరికి.. తిరిగి ఏమీ ఇవ్వకపోతే లావైపోతా అంటూ చెప్పే డైలాగ్ తో పాటు.. ఊరికి ఎంతోకొంత చేయని బతుకు ఒక బతుకేనా? అన్న సూటి ప్రశ్నతో నడిచే ఈ సినిమా తెలుగు ప్రజలకు విపరీతంగా కనెక్ట్ కావటం తెలిసిందే.
శ్రీమంతుడు అంటే కోట్ల రూపాయిల ఆస్తి మాత్రమే కాదని.. మనిషిగా.. గుణమంతుడిగా.. తన చుట్టూ ఉన్న వారికి మంచి చేయటంలోనూ మనసున్న మనిషి మాత్రమే శ్రీమంతుడని ఈ సినిమా చెప్పకనే చెప్పేస్తుంది. సినిమాలోని కాన్సెప్ట్ ను రియల్ లైఫ్ కి కాసేపు ముడి పెట్టి చూద్దాం. తెలుగోడిగా అత్యున్న స్థానంలో ఉన్న వెంకయ్యనాయుడికి.. తన సొంత రాష్ట్రం గురించి ఎందుకు పట్టదు?
అనర్గళంగా ఇంగ్లిషు.. హిందీలోనూ మాట్లాడే వెంకయ్యను తెలుగోడిగానే చూస్తారని మర్చిపోకూడదు. మోడీ సర్కారులో కీలకభూమిక పోషించే వెంకయ్య గురించి తెలుగువారంతా గొప్పగా చెప్పుకుంటారు. మరి.. అంత గొప్పగా చెప్పుకునే సమూహానికి కష్టం వస్తే.. పట్టించుకోకపోవటమే కాదు.. మాట తిప్పేసి.. మీ చావు మీరు చావండన్నట్లుగా వ్యవహరించటం ఏమిటి?
అత్యున్నత స్థానంలో ఎదిగిన వెంకయ్యకు.. తానీ స్థానంలో ఉన్నందుకు తోడ్పాటు అందించిన గడ్డ.. ఈ రోజు పీకల్లోతు కష్టంలో కూరుకుపోయిందని తెలిసి కూడా ఎందుకని పట్టనట్లు ఉంటున్నారు. ఎంతో ఇచ్చిన గడ్డకు.. ఏమీ ఇవ్వనందుకేనా వెంకయ్య లావు అయిపోయింది? విభజనతో కష్టాల ఊబిలో కూరుకుపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పించే విషయంలో వెంకయ్య కానీ నిజాయితీగా పని చేస్తే ఫలితం ఉండకుండా ఉంటుందా? జన్మనిచ్చిన ఊరు కంటే.. పార్టీనే పెద్దది అయిపోయిందా వెంకయ్యా?
దేన్లోను వంక పెట్టని రీతిలో అత్యున్నత స్థానంలో ఉన్న వెంకయ్య తెలుగు ప్రజల మనసుల్లో మాత్రం శ్రీమంతుడు కాలేడు. సొంతూరిని పట్టించుకోని వెంకయ్య ఎంత ఉన్నత స్థానంలో ఉండి ఏం చేసినా.. తెలుగు గడ్డ మాత్రం వెంకయ్య చేస్తున్న పనుల్ని గుర్తు పెట్టుకుంటుందన్న విషయం మర్చిపోకూడదు. చేసిన తప్పులేవో చేసేశారు. ఆ కారణంగానే ఈ రోజును మునికోటి కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడుతున్న దుస్థితి. కనీసం ఇప్పుడైనా స్పందిస్తే బాగుంటుంది వెంకయ్య.