అదృష్టవంతుడ్ని చెడగొట్టేవాడు ఉండడు.. దురదృష్టవంతుడ్ని బాగు చేసేటోడు ఉండడంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది. కలిసి రావటం ఎలా ఉంటుందన్నదానికి తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతమే నిదర్శనంగా చెప్పొచ్చు. స్వచ్ఛభారత్ ప్రచారం కోసం రూపొందించిన షార్ట్ ఫిలింస్ లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి.. వాటి దర్శకుల్ని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడ్ని ఆహ్వానించింది తెలంగాణ రాష్ట్ర సర్కారు.
వెంకయ్య వస్తున్న ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు. నిజానికి వెంకయ్య లాంటి వాళ్లు ఈ తరహా కార్యక్రమాలకు చాలానే వాటికి హాజరవుతుంటారు. అయితే.. మిగిలిన వాటి కంటే తాజా కార్యక్రమం ప్రత్యేకత.. మోడీ మానసపుత్రిక అయిన స్వచ్ఛ భారత్. ప్రధానికి ఎంతో ఇష్టమైన ఒక పథకానికి సంబంధించిన చేపట్టిన కార్యక్రమానికి వచ్చిన వెంకయ్యకు.. ఉత్త చేతులతో కార్యక్రమానికి వెళ్లటం అస్సలు నచ్చలేదట.
అంతే.. అప్పటికప్పుడు అధికారుల్ని ఆదేశించి మొత్తంగా రూ.31.20 కోట్ల చెక్కును సిద్ధం చేయించారట. ఆ మొత్తాన్ని తాజాగా కార్యక్రమానికి పాల్గొన్న వెంకయ్య.. మంత్రి కేటీఆర్ చేతికి ఇచ్చారు. ప్రధాని మోడీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఉద్యమం మాదిరి తీసుకెళ్లేలా ఉండటం.. అలాంటి వాటికి ప్రోత్సాహం అందిస్తే.. ప్రధాని మనసు దోచుకోవచ్చని అనుకున్నారేమో కానీ.. భారీ మొత్తంతో చెక్కుఅందించి ఆశ్చర్యపరిచారు. ఉత్త చేతులతో వెళ్లటం మనసొప్పక పోతే.. ఏపీలో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనే ఆయన.. ఇప్పటివరకూ ఇలా చెక్కులు ఇవ్వాలని ఎందుకు అనిపించలేదు చెప్మా..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/