రాష్ర్టపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు?

Update: 2017-06-11 05:43 GMT
వడ్డించేవాడు మనవాడైతే ఏ పంక్తిలో కూర్చుంటే ఏం అన్నట్లుగా ఉంది కేంద్ర మంత్రి వెంకయ్య తీరు. రాష్ర్టపతి ఎన్నికలకు టైం ముంచుకొస్తున్న తరుణంలో ఆయన తాజగా చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకాలం రాష్ర్టపతి పదవికి తన పేరు పరిశీలనలో లేదని చెప్పుకొచ్చిన ఆయన లేటెస్టుగా కొత్త ట్విస్టులు ఇస్తున్నారు.  పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే రాష్ర్టపతి పదవికి పోటీ చేస్తానంటున్నారు. వెంకయ్య మాటలతో రాజకీయవర్గాల్లోనూ పలు సందేహాలు మొదలయ్యాయి. ఆయన ఊరికే లీకులివ్వరని... ఎన్డీయే రాష్ర్టపతి అభ్యర్థి ఆయనేనని అంటున్నారు.
    
నిజానికి ఎన్డీయే రాష్ర్టపతి అభ్యర్థి ఇంతవరకు ఖరారు కాకున్నా జార్ఖండ్ కు చెందిన గిరిజన మహిళా నేత ద్రౌపది ముర్ము పేరు బాగా వినిపించింది. దాదాపు అన్ని పార్టీలూ ఆమే ఫైనల్ అని కన్ఫర్మయిపోయాయి కూడా.  కానీ.. తాజాగా వెంకయ్య మాటలు చూస్తుంటే బీజేపీ ఉద్దేశపూర్వకంగానే వెంకయ్యను దాచి పెట్టి ద్రౌపదిని ముందుకు తెచ్చిందని భావిస్తున్నారు. పరిస్థితుల అనుకూలతలు చూసుకుని ఇప్పుడు వెంకయ్య పేరు ప్రకటించేందుకు సిద్ధమవుతోందని అంటున్నారు.
    
విపక్షాలకు సరైన బలం లేకపోవడం, వారికి సరైన అభ్యర్థీ దొరక్కపోవడంతో వెంకయ్య కూడా ధైర్యం తెచ్చుకున్నారని... ఇప్పటికే దీనిపై బీజేపీ పెద్దలు వెంకయ్యతో చర్చించారని తెలస్తోంది. మొత్తానికి వెంకయ్య లీకులే నిజమైతే నీలం సంజీవరెడ్డి తరువాత మరో తెలుగువాడు రాష్ఱ్టపతి కానున్నట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News