తెలంగాణ ఆర్థిక మంత్రి కానున్న వెంటక్రామిరెడ్డి..? కేసీఆర్ అందుకే ఇచ్చారా..?

Update: 2021-11-18 10:40 GMT
తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు జోరెత్తుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో ఖాళీ స్థానాలను భర్తీ చేయడంలో టీఆర్ఎస్ తలమునకలవుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు.

దీంతో ఆశావాహులు తమకు పదవి వరిస్తుందని ఆశపడుతున్నారు. అయితే ఇప్పటికే కొందరు పేర్లు జోరుగా ప్రచారం సాగుతున్నాయి. ఎమ్మెల్సీగా ఎన్నికైన వారిలో కొందరిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీరిలో కలెక్టర్ గా రాజీనామా చేసి పార్టీలో జాయిన్ అయిన వెంటనే టికెట్ పొందిన వెంకట్రామిరెడ్డికి కీలక పోర్టు పోలియో అప్పజెప్పనున్నారు.

సిద్దిపేట కలెక్టర్ గా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డి మరో ఆరు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. అయితే వీఆర్ఎస్ తీసుకొని వెంటనే టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఆయన కలెక్టర్ పోస్టుకు రాజీనామా చేసిన 24 గంటలు కాకముందే ఆమోదించడం విశేషం.

దీంతో టీఆర్ఎస్ అధినేత హామీతోనే వెంకట్రామిరెడ్డి తన పోస్టుకు రాజీనామా చేసినట్లు సమాచారం. గులాబీ కండువా కప్పుకోగానే వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ కే అనుకూలంగా ఉండడంతో టికెట్ వచ్చినవారు దాదాపు ఎమ్మెల్సీగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కాగానే కేబినెట్లోకి తీసుకుంటారని ఉహాగానాలు వస్తున్నాయి. అంతేకాకుండా కీలక శాఖ అయిన ఆర్థికశాఖను వెంకట్రామిరెడ్డికి అప్పజెప్పనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్థిక శాఖ హరీశ్ రావు వద్ద ఉంది. దానిని హరీశ్ రావు నుంచి వెంకట్రామిరెడ్డికి ఇచ్చే యోచనలో ఉన్నారు.

దీంతో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వెంకట్రామిరెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే నిన్నటి వరకు ఆయనకు రెవెన్యూ శాఖ అప్పగిస్తున్నట్లు తెలిసింది. కానీ మారిన పరిస్థితులను భట్టి ఆయనకు ఆర్థిక శాఖను ఖరారు చేసినట్లు సమాచారం.

2018 ఎన్నికల తరువాత ఆర్థిక శాఖను హరీశ్ రావుకు కేటాయించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్థిక శాఖను ఈటల రాజేందర్ నిర్వహిస్తూ వస్తున్నారు. రెండో దఫా అధికారంలోకి వచ్చిన ఈ శాఖను కేసీఆర్ తన వద్దేఉంచుకున్నారు.

ఓసారి బడ్జెట్ కూడా కేసీఆరే ప్రవేశపెట్టారు. ఇక తొలి కేబినెట్లో హరీశ్ రావు చోటు దక్కలేదు. అయితే ఆ తరువాత వచ్చిన విమర్శల నేపథ్యంలో హరీశ్ రావుకు మంత్రి పదవి అప్పచెబుతూ ఆర్థిక శాఖను కేటాయించారు. అయితే హరీశ్ రావు కు ఆర్థిక శాఖ ను కేటాయించిన తరువాత కరోనా కాలంతోనే సమయం గడిచింది. సమర్థంగా నిర్వహించడానికి అవకాశం లేకుండా పోయింది.

ఇక తాజాగా ఈటల రాజేందర్ రాజీనామా నేపథ్యంలో ఆయన నిర్వహిస్తున్న వైద్య శాఖను హరీశ్ రావుపు అప్పజెప్పారు. దీంతో హరీశ్ రావు అనుచరులు సంబరాలు చేసుకున్నారు. ఆయన వద్ద రెండు శాఖలు ఉంటాయని అందరూ భావించారు. కానీ తాజాగా వస్తున్న వార్తల నేపథ్యంలో హరీశ్ రావు నుంచి ఆర్థిక శాఖను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఆయన వద్ద నుంచి ఆ శాఖ ను తీసుకొని వెంకట్రామిరెడ్డికి అప్పజెప్పనున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటయిన సందర్భంలో ఆయా జిల్లాలకు మంత్రులు, విప్ లు వెళ్లి కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంలో కేసీఆర్ స్వయంగా సిద్ధిపేట జిల్లాకు వెళ్లి కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని అభినందించారు. ఇక ఇటీవల కలెక్టర్ కార్యాలయ భవనం పూర్తయిన సందర్భంగా కేసీఆర్ స్వయంగా అక్కడికి వెళ్లి భవనాన్ని ప్రారంభించారు.

ఈ సమయంలో వెంకట్రామిరెడ్డి కేసీఆర్ కాళ్లపై పడ్డాడు. దీంతో కొన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చినా..తనకంటే పెద్ద మనిషి అయినందు వల్లే అలా చేశానని వివరణ ఇచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ కృతజ్ఒత కిందే వెంకట్రామిరెడ్డికి మంత్రి పదవి.. అందులోనూ కీలక శాఖ అయిన ఆర్థిక శాఖను కట్టబెడుతున్నట్లు ప్రచారం జరగుతోంది.
Tags:    

Similar News