బుగ్గ 'కారు' చిచ్చు

Update: 2015-10-28 07:38 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధుల మధ్య గొడవకు కారణమైంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు ఇద్దరూ సిల్లీగా కారు కోసం కొట్టాడుకున్నారు.

టీఆర్ ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాలాచారి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ వద్ద కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఎం సాహ్నిని కూడా ఆ తర్వాత ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. అయితే... ఇద్దరు ప్రత్యేక ప్రతినిధులు ఉన్నా నిన్నమొన్నటి వరకు చారికే ప్రాధాన్యముండేది. కానీ, రీసెంటుగా కేసీఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడు మాత్రం మొత్తం సీను మారిపోయింది.  అప్పటిదాకా వేణుగోపాలాచారికి ప్రభుత్వం కేటాయించిన బుగ్గ కారును తెలంగాణ భవన్ అధికారులు సాహ్నికి బదిలీ చేశారు. వేణుగోపాలాచారికి మాత్రం ప్రైవేట్ కారును ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కసారిగా భగ్గుమన్న వేణుగోపాలాచారి అధికారుల నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారట.

ఆయన నిర్మొహమాటంగా... తన కారును సాహ్నికి ఎలా ఇస్తారని అధికారులను ప్రశ్నించడంతో వారు సమాధానం చెప్పలేకపోయారు.  మరోవైపు కేసీఆర్ కేంద్రంలో కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ ఐ ఆస్పత్రుల నిర్మాణ కాంట్రాక్టును ఏపి మత్స్య శాఖకు కట్టబెట్టిన కేసుకు సంబంధించి కేంద్ర కార్మిక శాఖ మాజీ కార్యదర్శి సాహ్నిని సిబిఐ ప్రశ్నించనుంది.
Tags:    

Similar News