మాల్యాపై కుట్ర జ‌రుగుతోంది..బ్యాంకులే త‌ప్పు చేశాయి

Update: 2018-03-17 08:21 GMT
భారతీయ బ్యాంకులకు సుమారు 9 వేల కోట్లు ఎగవేసిన జ‌ల్సాల‌రాయుడు - లిక్క‌ర్ కింగ్ విజ‌య్‌ మాల్యా విచార‌ణ ఎపిసోడ్ మ‌లుపులు తిరుగుతోంది. కోట్లు ఎగ‌వేసిన మాల్యా ప్రస్తుతం లండన్‌ లో తలదాచుకుంటున్న సంగ‌తి తెలిసిందే. మాల్యాను అప్పగించాలని బ్రిటన్‌ను భారత్ అభ్యర్థించింది. ఆ కేసులో భాగంగా జ‌రిగిన‌ విచారణలో ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. విజయ్ మాల్యా అప్పగింత కేసుపై శుక్రవారం లండన్‌ లోని వెస్ట్‌ మిన్‌ స్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగింది. మాల్యా ఎగవేత కేసును పరిశీలిస్తున్న ఆ కోర్టు న్యాయమూర్తి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కింగ్‌ ఫిషర్ అధినేత మాల్యాకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులే నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తోందని జడ్జి ఎమ్మా ఆర్బుత్నాట్ తెలిపారు. ముక్కలు ముక్కలుగా ఉన్న కేసు ఇప్పుడిప్పుడు ఒక దగ్గరకు వస్తున్నదని, ఇప్పుడిప్పుడే తనకు ఆ కేసు అర్థమవుతోందన్నారు. భారతీయ బ్యాంకులు స్వంత నిబంధనలను ఉల్లంఘించాయన్న విషయం తనకు ఇప్పుడే తెలుస్తోందని ఆమె అన్నారు. భారతీయ బ్యాంకులు దీని పట్ల వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆమె అన్నారు. మాల్యాపై కుట్ర జరుగుతుందన్న కోణం అందులో ఉన్నట్లు ఆమె వెల్లడించారు.
Tags:    

Similar News