క్రికెట్ పిచ్చి కలుగులోని ఎలకలను కూడా బయటకు రప్పిస్తోంది. ఎలకేం ఖర్మ... వరల్డ్ కప్‌లో ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్ చూడ్డానికి భారత్ నుంచి పారిపోయిన పెద్ద పందికొక్కే కలుగులోంచి బయటకు వచ్చింది. ఇంతకీ ఈ పంది కొక్కు ఎవరు అనుకుంటున్నారా.. ఇంకెవరో కాదు - బ్యాంకులకు రూ.వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాయే ఆ పందికొక్కు. ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ ను చూసేందుకు విచ్చేశారు.
కాగా... క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన విజయ్ మాల్యా విలేకర్లకు చిక్కారు. వీళ్లు మాట్లాడించేందుకు ప్రయత్నించగా ‘‘నేను క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చాను’’ అని చెప్పి మాల్యా అక్కడి నుంచి వెళ్లిపోయారు. భారత్ లోని బ్యాంక్ లకు విజయ్ మాల్యా దాదాపు రూ.10,000 కోట్లకు పైగా బకాయి పడ్డాడు. మాల్యాను వెనక్కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. యూకే హోం సెక్రటరీ మాల్యాను అప్పగించేలా ఆదేశాలపై సంతకాలు చేశారు. దీనిపై మాల్యా అప్పీల్ కు వెళ్లారు. జులై 2వ తేదీన దీనికి సంబంధించిన తీర్పు వెలువడనుంది.
గతంలో మాల్యా భారత్ కు రావడం ఖాయమైపోయిందని - అతడి కోసం జైలు గది కూడా సిద్ధమైందన్న వార్తలు వచ్చాయి. అంతేకాదు - వేలకోట్లు ఎగ్గొట్టిన మాల్యా కోసం జైలులో ప్రత్యేక వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వార్తలు హల్ చల్ చేశాయి. ఆ తర్వాత మాల్యా గురించి మళ్లీ ఒక్క ముక్కలేదు. ఇప్పుడు ప్రపంచకప్ లో భాగంగా కెన్నింగ్టన్ ఓవల్ లో ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మాల్యా తళుక్కుమన్నాడు. స్టేడియంలోని వీఐపీ సెక్షన్ లో కూర్చుని దర్జాగా మ్యాచ్ లను వీక్షించాడు.