బ్యాంకులకు వేలకోట్ల రుణాలు చెల్లించకుండా పారిపోయి విదేశాల్లో దాగి ఉన్న ఆర్థిక నేరగాడు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా త్వరలోనే భారతదేశానికి రానున్నాడు. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం భారత బ్యాంకుల వద్ద తీసుకున్న రూ. 9 వేల కోట్ల రుణాలకు సంబంధించి విజయ్ మాల్యా మోసం, మనీ ల్యాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అతడిని స్వదేశం తీసుకొచ్చే ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అతడిని తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అతడి అప్పగింతకు సంబంధించిన న్యాయ ప్రక్రియ మొత్తం పూర్తికావడంతో.. ఏ క్షణమైనా ఆయనను దేశానికి తీసుకొచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. తనను భారత్‌కు అప్పగించాలనే నిర్ణయాన్ని విజయ్ మాల్యా సవాల్ చేశాడు. ఈ విషయమై మే 24వ తేదీన యూకే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో అతడికి ఇక అన్ని మార్గాలు మూసుకుపోయి స్వదేశం భారత్ రావాల్సిందే.
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కొద్ది రోజుల్లో ఏ క్షణమైనా మేం మాల్యాని భారత్‌కు తరలించవచ్చని కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన ఓ అధికారి తెలిపారు. అయితే ఎప్పుడు అనేది తెలియలేదు. విజయ్ మాల్యా యూకే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురవడంతో ఆయన తరలింపునకు సంబంధించిన న్యాయప్రక్రియ అంతా పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.
భారత్‌కు మాల్యాను తీసుకునే విషయమై సీబీఐ, ఈడీ అధికారులు యూకేలో ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారు. తొలుత తామే కేసు నమోదు చేశాం కాబట్టి... మాల్యా భారత్‌కు రాగానే ముందు మేమే కస్టడీలోకి తీసుకుంటామని సీబీఐ అధికారులు చెబుతున్నారు.