వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో సారి ట్విట్టర్ లో యుద్ధం ప్రకటించారు. ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ రాధాకృష్ణ రాసిన ‘కొత్త పలుకు’ వ్యాసాన్ని పట్టుకొని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి బండారం బయటపెట్టేశారు. యనమల చేసిన కుట్రను ట్విట్టర్ సాక్షిగా విడమర్చి చెప్పి కడిగిపారేశాడు. టీడీపీ అధినేత చంద్రబాబు - జనసేనాని పవన్ కళ్యాణ్ లను ఉతికి ఆరేశారు.
తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ.. ‘యనమల గారు కూడా నీతి బోధలు చేస్తున్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో ఈయన ప్రధాన భాగస్వామి. అప్పటి పల్లకీ సేవకు తన బంధువులకు అనేక పదవులు - వేల కోట్ల కాంట్రాక్టులు ఇప్పించుకున్నాడు. కులజ్యోతి రాసిన కడుపు మంట వార్తను పట్టుకుని పత్తిగింజ కబుర్లు చెబుతున్నాడు’ అంటూ నిప్పులు కురిపించారు.

ఇక మరో ట్వీట్ లో చంద్రబాబు - పవన్ కళ్యాణ్ బంధాన్ని విడమర్చి కడిగిపారేశారు. పవన్ గురించి ఆయన ప్రధాన అనుచరుడుగా ఇన్నాళ్లు ఉన్న రాజు రవితేజ ఆరోపణలపై టీడీపీ - పచ్చమీడియా ఎందుకు స్పందించరంటూ దుమ్మెత్తిపోశారు. ‘చంద్రబాబుని, దత్త పుత్రుడిని భుజాలపై మోస్తున్న ఎల్లో మీడియాకు రాజా రవితేజ గారు చెబ్తున్న ‘సెటిల్మెంట్ల’ రహస్యాలు వినిపించడం లేదు. తమ కోడి కూస్తేనే తెల్లారుతుందని భ్రమ పడుతోందింకా. అరచేతులు అడ్డు పెట్టి ఎంత దాచినా సోషల్ మీడియా ఊరుకోదుగా? చీల్చి చెండాడుతోంది.’’ అంటూ ఫైర్ అయ్యారు.