తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులందరికీ చంద్రబాబే ఫైనాన్సియర్ అని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి - రాజ్యసభ సభ్యులు వీ. విజయ సాయి రెడ్డి విరుచుకుపడ్డారు. ట్విట్టర్ ద్వారా ఆయన మరోసారి పదునైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లేట్ రాహుల్ గాంధీ దూతగా అమరావతికి వచ్చి బాబును కలవడం వెనుక రహస్యం ఇదేనని ఆయన సంచలన ట్వీట్స్ చేశారు. తెలంగాణ ఎన్నికల్లో వెయ్యి కోట్ల రూపాయలు పెట్టడానికి డీల్ కుదిరిందని.. ఈ సొమ్మంతా పాలు - కూరగాయలు అమ్మితే వచ్చిన లాభమా అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు విజయ సాయి రెడ్డి.
ఇక వైఎస్ జగన్ పై హత్యాయత్నం చేసిన తీరును విజయ సాయి రెడ్డి ఎండగట్టారు. ‘వెయ్యి గొడ్లను తిన్న రాబంధు.. ఒక్క గాలివానకు కూలుతుందని.. పింగళి దశరథ రామ్ ను - రాఘవేంద్రరావును - మల్లెల బాబ్జీని - వంగవీటి రంగాను చంపించిన - ఇంకా ఎంతో మంది హత్యలకు పథక రచన చేసిన ముఠా అప్పుడు తప్పించుకోవచ్చు.... కానీ జననేత జగన్ హననానికి ప్రయత్నించిన కోడికత్తి ముఠా ఇప్పుడు తప్పించుకోలేదు ’ అంటూ ఆయన ట్వీట్ లో ఫైర్ అయ్యారు.