అంతా అమరావతి నుంచినే అంటూ మాట్లాడుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. అమరావతి తరఫున చంద్రబాబు నాయుడు వకాల్తా పుచ్చుకుంటూ ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు.. కర్నూలు, విశాఖల తరఫున కూడా తనే మాట్లాడుతూ ఉన్నారు. ఆ నగరాల ప్రజలు రాజధానిని అసలు కోరుకోవడం లేదంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. తరచూ అదే మాట చెబుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మాటలపై విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు.
కర్నూలు, విశాఖ ప్రజలు రాజధానులను కోరుకోవడం లేదు.. అంటున్న చంద్రబాబును సూటిగా నిలదీశారు విజయసాయి రెడ్డి. ఆ మాటను చంద్రబాబుకు ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు.
'ప్రధానులను డిసైడ్ చేశాను. రాష్ట్రపతులను సెలెక్ట్ చేశానని డప్పుకొట్టుకునే వ్యక్తి ఇన్ సైడర్ భూములు కాపాడుకునేందుకు దిగజారి మాట్లాడుతున్నాడు. ఉత్తరాంధ్ర ప్రజలు వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ రాజధాని కోరుకోవడం లేదట. కర్నూలు వాళ్లు జ్యుడీషియల్ క్యాపిటల్ వద్దేవద్దని ఈయన చెవిలో చెప్పారట..' అంటూ విజయసాయి రెడ్డి చంద్రబాబు మీద వ్యంగ్యంగా స్పందించారు.
ఇక ఇదే సమయంలో జనసేన అధిపతి పవన్ కల్యాణ్ మీద కూడా విజయసాయి రెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. 'ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడు పచ్చ మీడియా అనే ‘కీలు గుర్రం’ ఎక్కి స్వారీ చేస్తున్నారు. రివ్వున ఎగిరినట్టు కలల్లో తేలిపోతున్నారు. పరమ అవమానకరంగా పరాజయం పాలై ఆరు నెలలు తిరగక ముందే చిటెకలు వేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎవరైనా చెప్పండయ్యా. వెకిలి చేష్టలతో పరువు తీసుకోవద్దని.' అంటూ పవన్ కల్యాణ్ మీద విజయసాయి రెడ్డి తాజాగా స్పందించారు.