కుక్క‌,న‌క్క అంటూ బాబుపై విజ‌య‌సాయిరెడ్డి...

Update: 2020-01-21 16:38 GMT
ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తి వికేంద్రీక‌ర‌ణ‌, మూడు రాజ‌ధానుల ఏర్పాటుపై అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య విమ‌ర్శలు - ప్ర‌తివిమ‌ర్శ‌లు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. వైసీపీ టార్గెట్‌గా టీడీపీ, ప్ర‌తిప‌క్షాన్ని ఇర‌కాటంలో పెట్టేందుకు అధికార పార్టీ దూకుడుగా ముందుకు వెళుతోంది. ఈ క్ర‌మంలో తాజాగా వైసీపీ ముఖ్య‌నేత‌- పార్టీ పార్ల‌మెంట‌రీ నేత విజ‌య‌సాయిరెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  శాసనసభలో చంద్రబాబు పాలనా - అభివృద్ధి వికేంద్రీకరణ చర్చ సందర్భంగా చేసిన కామెంట్ల‌ను తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. చంద్రబాబు నక్క అంటే నక్క - కుక్క అంటే కుక్క అనుకునేలా ప్ర‌చారం జ‌రుగుతోంద‌న్నారు.

హైదరాబాద్ -ముంబై -కోల్‌ కతా - చెన్నై వంటి నగరాలతో పోలిస్తే అమరావతిలో నిర్మాణాలకు అయ్యే ఖర్చు తక్కువని చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు - అమ‌రావ‌తిపై ప‌లు మీడియా సంస్థ‌ల స్పంద‌న‌ను విజ‌య‌సాయిరెడ్డి త‌ప్పుప‌ట్టారు. ‘అమరావతికి వరద ముప్పు లేదంట. రేగడి నేలలైనా భారీ నిర్మాణాలకు అనుకూలమే అని చెప్పడానికి ఎల్లో మీడియా పడరాని పాట్లు పడుతోంది. చివరకు కోల్‌ కత - ముంబై నగరాలు ప్రమాదకరమైనవని తీర్పు చేప్పే సాహసానికి తెగబడింది. చంద్రబాబు నక్క అంటే నక్క, - కుక్క అంటే కుక్క’అని విజయసాయిరెడ్డి ట్విటర్‌ లో పేర్కొన్నారు.

‘అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రమోషన్ కోసం ఏటా స్విట్జర్లాండ్‌లోని దావోస్ సదస్సుకు వెళ్లేవాడు చంద్రబాబు. చిట్టినాయుడు కూడా ప్రత్యేక విమానాల్లో తిరిగొచ్చేవాడు. జపాన్ -  సింగపూర్ - చైనా - కజాకిస్థాన్  మలేసియా -  థాయిలాండ్ లకు లెక్కలేనన్ని సార్లు పర్యటనలు చేశారు’అని విజయసాయిరెడ్డి ఇంకో ట్వీట్లో దుమ్మెత్తిపోశారు.
Tags:    

Similar News