సుజనా బట్టలు చించుకోవటం వెనుక సీక్రెట్ అదేనట!

Update: 2019-12-20 14:30 GMT
ఏపీ రాజధానిపై ఏపీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు తమకు తోచినట్లుగా మాట్లాడేస్తూ అనవసరమైన గందరగోళానికి తెర తీస్తున్నారు విపక్ష నేతలు.. వారికి వత్తాసు పలికే మీడియా సంస్థలు. ఏమో ఎవరికి తెలుసు.. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చేమో? దక్షిణాఫ్రికాలో మాదిరి మూడు రాజధానులు ఏర్పడితే మంచిదే కదా? ప్రాంతాల మధ్య దూరం పెరగకుండా.. అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు కల్పించటం.. ఏపీలోని మూడు ప్రాంతాలు (సీమ..కోస్తా.. ఉత్తరాంధ్ర) అభివృద్ధి చెందాలనుకోవటం తప్పేం కాదు.

ఆ ఉద్దేశంతోనే ఏపీకి మూడు రాజధానుల మాట ఏపీ ముఖ్యమంత్రి జగన్ నోటి నుంచి వచ్చిన దానికి టీడీపీ.. బీజేపీ.. జనసేన నేతలు ఎవరికి వారు తమకుతోచిన వక్రభాష్యాలు వ్యక్తం చేయటం తెలిసిందే. వారు చేస్తున్న వ్యాఖ్యలపై ధీటుగా స్పందించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి.

తాజాగా ఆయన సోషల్ మీడియాలో కాస్తంత ఘాటు వ్యాఖ్యలు చేశారు.అమరావతిలో రాజధాని.. భోగాపురంలో ఎయిర్ పోర్టు.. ఇంకా ఏదైనా ప్రకటనకు ముందే తమ వాళ్లకు సమాచారం ఇచ్చి బాబు ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడినట్లుగా తప్పు పట్టారు. అది ఆయన పేటెంట్.. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని రావటం ఇష్టం లేని దత్తపుత్రుడు పచ్చపార్టీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తున్నారని ట్వీట్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏపీకి మూడు రాజధానులపై విమర్శలు చేసిన రాజ్యసభ సభ్యులు.. మొన్నటివరకూ బాబుతో ఉండి ఇప్పుడు బీజేపీ పంచన చేరిన సుజనా లాంటి వారు విమర్శలు చేయటాన్ని విజయసాయి తప్పు పట్టారు.

బాబు కోవర్టు సుజనా మాత్రం రాజధానిపై సీఎం ప్రకటనపై స్పందిస్తూ కేంద్రం చూస్తూ ఊరుకోదని బట్టలు చింపుకుంటున్నారన్న విజయసాయి.. అసలు విషయం ఏమంటే అమరావతిలో ఆయన భూములు ఉన్నాయన్న వ్యాఖ్యను చేశారు. విజసాయి ట్వీట్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మరి.. దీనికి సుజనా ఏ రీతిలో రియాక్ట్ అవుతారో చూడాలి.


Tags:    

Similar News