టీడీపీ అధినేత.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రిక్వెస్ట్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రిజెక్ట్ చేసినట్లుగా చెప్పాలి. కృష్ణా నది కరకట్ట వద్ద నివాసాన్ని తన పార్టీ కార్యక్రమాల కోసం కేటాయించాల్సిందిగా ఏపీ సీఎం జగన్ ను కోరుతూ ఒక లేఖ రాయటం తెలిసిందే. ఈ లేఖపై ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి సమాధానం చెప్పలేదు. కానీ.. గడిచిన రెండు రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేస్తున్న ట్వీట్లు చూస్తే విషయం ఇట్టే అర్థమైపోతుంది.
బాబు లేఖను కాసింత ఎటకారం చేస్తూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేస్తూ.. ఏపీ సీఎంకు రాసే మొదటి లేఖ ప్రజాసమస్యల మీద అనుకున్నాం కానీ.. ఇలా వ్యక్తిగత విషయాల కోసమని తాము అనుకోలేదన్న మాటతోనే తమ సమాధానం ఏమిటన్న విషయాన్ని విజయసాయి రెడ్డి చెప్పేశారు.
ఈ రోజు (శుక్రవారం) చేసిన ట్వీట్ లో మరింత క్లారిటీ ఇచ్చేశారు. మొదటి లేఖలో ప్రజా సమస్యలు ప్రస్తావించలేదంటూ విజయసాయి చేసిన ట్వీట్ మీద టీడీపీ సీనియర్ నేత యనమల ప్రెస్ మీట్ పెట్టి.. బాబు తొలి లేఖ జగన్ ప్రమాణస్వీకారం రోజున అభినందిస్తూ రాశారని.. ఇది రెండో లేఖగా చెప్పారు.
యనమల మాటలకు కౌంటర్ ఇచ్చిన విజయసాయి.. యనమల గారూ.. మీరు అడగటం.. మేం ఇవ్వటం మొదలు పెడితే లోకేశ్ కోసం ప్రకాశం బ్యారేజీ.. చంద్రబాబు కోసం పోలవరం ఇవ్వమని అడిగినా అడుగుతారంటూ చేస్తున్న వ్యాఖ్యలు చేస్తే.. బాబు రిక్వెస్ట్ ను ఏపీ సీఎం జగన్ రిజెక్ట్ చేసినట్లుగా చెప్పక తప్పదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. గురువారం విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇచ్చే క్రమంలో ప్రెస్ మీట్ పెట్టిన యనమలకు తాజాగా భారీ పంచ్ వేశారు. చంద్రబాబు మొదటి లేఖను జగన్ ప్రమాణస్వీకారం రోజు రాశారన్న విషయాన్ని గుర్తు చేసిన యనమల మాటను ప్రస్తావించిన విజయసాయి ట్వీట్ చేస్తూ.. పేరుకు ఆర్థికమంత్రిగా ఉన్నా అంతా కుటుంబరావే చూసుకోవటం వల్ల యనమలకు లెక్కలపై పట్టు తప్పింది. ప్రజావేదిక కేటాయించాలని బాబు రాసింది మొదటి లేఖ కాదు. శుభాకాంక్షలు తెలిపేందుకు రాసింది ఫస్ట్ లెటర్ అని సమర్థించబోయారు. మరి.. బాబు రాసిన లేఖపై DO లెటర్ 1/2019 అని ఎందుకుందో చెప్పాలంటూ ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి ట్వీట్లకు కౌంటర్ ఇచ్చేందుకు ఏ మాత్రం సాహసం చేయలేని రీతిలో యనమల నోటిని మూయించారని చెప్పక తప్పదు. విజయసాయి రెడ్డి ట్వీట్లను కౌంటర్ చేసే వేళలో.. కాస్తంత హోం వర్క్ చేసి చేస్తే బాగుంటుందేమో యనమల..?