తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోర పరాజయం తప్పదని వైసీపీ ప్రధాన కార్యదర్శి - ఎంపీ విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. ఏపీ సీఎం - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో దోస్తీ పై ఆ పార్టీలో పశ్చాత్తాపం కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు నేడు చేసిన పలు ట్వీట్లలో విజయసాయిరెడ్డి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘తెలంగాణలో పోటీ చేసింది 13 సీట్లే అయినా...అన్నీ తానే అయి ప్రచారం నిర్వహించిన చంద్రబాబు ఘోర పరాజయాన్ని మూటకట్టుకోబోతున్నారు. బాబుతో పొత్తుపెట్టుకొని దగ్గరకు వచ్చిన విజయాన్ని దూరం చేసుకున్నామని కాంగ్రెస్ నేతలు పశ్చాత్తాప పడుతున్నారు. ఇంటగెలవనోడు రచ్చ గెలవాలని చూడటం వలే చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రయోజనం ఉంది’ అని ఎద్దేవా చేశారు.
‘చంద్రబాబుతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి ఉంటే పరాజయం పాలైనా..కాంగ్రెస్ కు సానుభూతి మిగిలి ఉండేది. ఎక్కడా దిక్కులేక చంద్రబాబు డబ్బు మూటలతో వస్తే పెత్తనం అంతా ఆయనకు అప్పిగించి ఘోర పరాజయం మూటగట్టుకుంది. స్వయం కృతాపరాధం అంటే ఇదే’ అని మరో ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. ``తెలంగాణ - సీమాంధ్ర ప్రజలందరికీ ఒక్క విషయం బాగా అర్ధం అయింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ - టీడీపీ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఏపీలో బాబు దోపిడీ నుంచి పుట్టిందేనని. అవినీతి బాబు ఒక్క కేసులో దొరికినందుకు - ఏపీ ప్రజలు చెల్లించుకుంటున్న భారీ మూల్యాల్లో ఇదొకటి.`` అంటూ ఇంటకో ట్వీట్లో విజయసాయిరెడ్డి ఎత్తిపొడిచారు. ``చంద్రబాబు "పార్థీనియం" కలుపు మొక్క లాంటి వాడు. ఈ కబళించే కలుపు మొక్క(invasive weed) పంటలను నాశనం చేస్తుంది. ఈ కలుపు మొక్కను రైతులు పెరికేస్తారు. తెలంగాణా ప్రజానీకం ఇచ్చే తీర్పుతో చంద్రబాబు "పార్థీనియం" లైఫ్ రాజకీయంగా ముగిసినట్టే.`` అంటూ సంచలన జోస్యం చెప్పారు.