తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తామేం చేస్తామో మేనిఫెస్టో లో వివరిస్తూ రాజకీయ పార్టీలు పేర్కొన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితిని అధికారం నుంచి దించేందుకు కాంగ్రెస్ - తెలుగుదేశం - తెలంగాణ జన సమితి - సీపీఐ మహాకూటమిగా ఏర్పాటయిన సంగతి తెలిసిందే. కలిసి పోటీ చేస్తున్నా.... విడివిడిగానే మహాకూటమిలోని పార్టీలు తమ మేనిఫెస్టోలు విడుదల చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామో... లేదో కూడా తెలియని తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం తమ ఎన్నికల మేనిఫొస్టోను విడుదల చేసింది. అధికారం మాట దేవుడెరుగు తెలుగుదేశం పార్టీ మాత్రం తన హామీలతో తెలంగాణ ప్రజలను తమ వైపు తిప్పుకుందుకు మేనిఫెస్టోను వాడుకోవాలని భావిస్తున్నారు తెలుగుదేశం నాయకులు. రెండు లక్షల రూపాయల వరకూ రైతులకు రుణమాఫీ ఇస్తామన్న తెలుగుదేశం పార్టీ ఈ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తిస్తామని ప్రకటించింది. ఇక కొత్త ఓటర్లను ఆకట్టుకోవడంలో భాగంగా విద్యార్ధులకు ఉచిత ల్యాప్ ట్యాప్ లు కూడా ఇస్తామని ప్రకటించారు. అమర వీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని - నిరుద్యోగులకు ప్రతి నెలా మూడు వేల రూపాయల నిరుద్యోగి భృతి ఇస్తామని కూడా ప్రకటించారు. ఇక తెలంగాణలో ప్రధాన ఆదాయవనరు బెల్టు షాపులను రద్దు చేస్తామని ప్రకటించింది తెలంగాణ తెలుగుదేశం పార్టీ.
అధికారంలోకి వచ్చిన వెంటనే జయశంకర్ పేరిట విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ పేద యువతుల వివాహాలకు లక్షా ఏభై వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని పేర్కొన్నారు. అనాథలు - వితంతువులకు - వృద్ధులకు నెలకు రూ.2వేల పింఛన్ ఇస్తామని ప్రకటించారు. అగ్ర వర్ణాల సంక్షేమానికి కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తెలంగాణలో ప్రతి ఇంటికి నీరు ఇస్తామని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ను ఉచితంగా ఇస్తామన్న హామీని గుప్పించారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ కురిపించే వరాలైతే.... వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టోపై పరోక్షంగా విరుచుకుపడింది. అంతే కాదు... దేన్నైనా కాపీ కొట్టడంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఉంటారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శించారు. ఐటి భాషలో చంద్రబాబు నాయుడు కాపీ - పేస్ట్ మ్యాన్ అని ట్విట్టర్ లో విమర్శించారు. ఇది పరోక్షంగా తమ మేనిఫెస్టోను తెలుగుదేశం పార్టీ కాపీ కొట్టిందనే అర్ధంలో చెప్పడం విశేషం.