తన మాటలతో తెలుగు తమ్ముళ్లలో వణుకు తెప్పిస్తున్న విజయసాయి రెడ్డి తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని చెప్పారు. హోదా కోసం మొదట్నించి ఒకే స్టాండ్ మీద పోరాడుతున్న తమ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని అధిక్యతతో దూసుకెళ్లటం ఖాయమన్నారు.
ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 150 సీట్లు కచ్ఛితంగా వస్తాయన్న జోస్యం చెప్పారు. అదే సమయంలో ఏపీలోని లోక్‌సభా స్థానాల్ని తమ పార్టీ గెలుచుకోవటం ఖాయమన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీకి వచ్చినట్లుగా చెబుతున్న చంద్రబాబు.. హీరోయిన్లు.. హీరోలతో ఫోటోలు దిగారంటూ ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం టీడీపీ టైర్ల కోసం వెతుకుతుందని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సైకిల్ కు ఉన్న రెండు టైర్లలో గతంలో ఒక టైరును కమ్యునిస్టులు.. మరోటైరును ఇతర పార్టీలు నడిపేవని.. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక టైరును బీజేపీ.. మరో టైరును జనసేన నడిపాయని చెప్పారు. ఈసారి రెండు టైర్లు తమ దారిన తాము వెళ్లేసరికి కొత్త టైర్ల కోసం బాబు వెతుకుతున్నారన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బాబును నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య మెజార్టీ రావటం ఖాయమన్నారు. రహదారులపై ఎక్కడ యూటర్న్ కనిపించినా చంద్రబాబే గుర్తుకు వస్తున్నారన్నారు. యూటర్న్ లలో బాబుకు మించినోళ్లు లేరన్నారు. ప్రతి యూటర్న్ దగ్గరా బాబు ఫోటో పెడితే మరింత బాగుంటుందంటూ వ్యంగ్యస్త్రాలు సంధించిన విజయసాయి మాటల చురకల్ని తెలుగు తమ్ముళ్లు భరించలేనివిగా మారాయని చెప్పక తప్పదు.