వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు - ఎంపీ విజయసాయిరెడ్డి - రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇప్పుడది బహిరంగ లేఖ వరకూ చేరింది. సుజనా అక్రమ వ్యవహారాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) - సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని విజయ సాయిరెడ్డి రాసిన లేఖపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్పందించడం - రాష్ట్రపతి కార్యాలయం.. ఆ లేఖను హోం మంత్రిత్వ శాఖకు పంపడం, హోం మంత్రిత్వ శాఖ సదరు లేఖను సంబంధిత శాఖలకు ఫార్వర్డ్ చేయడం...ఈ పరిణామం సుజనాచౌదరి లైట్ తీసుకోవడం తెలిసిన సంగతే. అయితే, తాజాగా దీనిపై విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ మేరకు ప్రతికా ప్రకటన విడుదల చేసి సుజనా చౌదరిని మరింత ఇరకాటంలో పడేశారు. ``సుజనా చౌదరి (వైఎస్ చౌదరి) మీద నేను చేసిన ఆరోపణలకు పూర్తిగా కట్టుబడి ఉన్నాను. వైఎస్ చౌదరి గత రెండు మూడు దశాబ్దాలుగా నకిలీ కంపెనీలను సృష్టించి ఎలా మోసం చేశారో... భారత బ్యాంకింగ్ వ్యవస్థను రూ. 8 వేల కోట్ల మేరకు ఎలా ముంచేశారో - సింగపూర్ లో చేసిన మోసాలు ఏమిటో... మారిషస్ లో చేసిన కుంభకోణం ఏమిటో... దుబాయ్ - అమెరికాల్లో ఆయన ఆర్థికంగా చేసిన తప్పుడు పనులు ఏమిటో... సేల్స్ ట్యాక్స్ - కస్టమ్స్ - కేంద్ర ఎక్సైజ్ - ఐటీ శాఖలను ఎలా నిలువునా ముంచాడో వివరంగా నేను రాష్ట్రపతికి లేఖ రాస్తే - ఆ ఆరోపణలు తప్పని సుజనాచౌదరి భావిస్తే... ఎలాంటి విచారణకు అయినా తాను సిద్దం అని ప్రకటించి ఉండేవారు. కానీ అటువంటి ప్రకటనలు చేయకుండా తన మీద ఏ విధమైన ఫిర్యాదులు... ఏ సంస్థ కానీ - ఏ వ్యక్తి కానీ చేయలేదు అంటూ మరో పచ్చి అబద్దం చెప్పారు.` అంటూ లాజిక్ ప్రకారం ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ప్రముఖ మీడియా సంస్థ ఆంధ్రజ్యోతిని సైతం విజయ సాయి రెడ్డి ప్రస్తావించారు. ``సుజనాచౌదరి మీద ఇప్పటి ఆయన మిత్రుడు - ఒకప్పుడు ఆయనను కిందకు లాగాలని అనుకున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే మూడు రోజుల పాటు ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో సుజనా వారి మాయా సామ్రాజ్యం అంటూ పతాక శీర్షికల్లో వార్తా కథనాలు ప్రచరించారు. సుజనాచౌదరి వంటి ఆర్థిక నేరస్తుల మీద భారతదేశంలోని ఈడీ - సీబీఐ పనిచేయకపోతే అసలు ఆ సంస్థల మనుగడకే అది ముప్పు. `` అని అన్నారు. ``మరొక అంశాన్ని కూడా ఇక్కడ చెప్పాలి. తన జీవితం తెరిచిన పుస్తకం అని సుజనా చౌదరి అంటున్నాడు. అది ఎవరు తెరిచిన పుస్తకం అన్నదే ముఖ్యం. అది చంద్రబాబు తెరిచిన పుస్తకం. చంద్రబాబు కోసం తెరిచిన పుస్తకం.` అంటూ ఎద్దేవా చేశారు. ``ఇంకో ముఖ్య విషయం. కేంద్రప్రభుత్వం ఈ అంశం మీద దర్యాప్తు చేయాల్సిందిగా హోంమంత్రిత్వ శాఖను ఆదేశిస్తే... వైఎస్ చౌదరి ఏమంటున్నారంటే... అది కేవలం ఎకనాలెడ్జ్ మెంట్ అని - తన ప్రతిష్టను నేను దిగజారుస్తున్నాను అని అంటున్నారు. అది కేవలం ఎకనాలెడ్జ్ మెంట్ అయితే సుజనాచౌదరి ఎందుకు ఇంతగా భయపడుతున్నాడు?` అని ప్రశ్నించారు.
``చివరిగా ఒక్కమాట చెబుతున్నాను. కేవలం ఒక్క మనిషి ... డిపాజిటర్లు ప్రభుత్వ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ములను వేల కోట్ల మేరకు మింగేసినా... అలాంటి వ్యక్తిని వదిలేస్తే... ఇక భారతదేశంలో న్యాయం, చట్టం అనే పదాలకు విలువ వుండదు. సుజనాచౌదరి మీద నేను ఇచ్చిన సమాచారానికి కట్టుబడి వున్నాను. సీబీఐ విచారణను, ఈడీ విచారణను అడ్డుకోబోనని వైఎస్ చౌదరి పత్రికాప్రకటన చేస్తారా? ` అని విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.