తెలుగుదేశం పార్టీ రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనంపై తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందించారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో వెళ్లటం వెనుక ఉన్న కొత్త కోణాన్ని విజయసాయి ప్రస్తావించారు. తాను చేసిన అవినీతి బయటపడకుండా ఉండటంతో పాటు.. రాజీ కోసం తన ఎంపీల్ని ముందస్తుగా బాబు పంపారంటూ వ్యాఖ్యానించారు.
బాబు ఎంపీలపై ఆసక్తికర ట్వీట్ వ్యాఖ్యలు చేసిన విజయసాయి.. జగన్ కు బాబుకు మధ్యనున్న వ్యత్యాసాన్ని మరో ట్వీట్ లో వెల్లడించారు. తమకు ఓటు వేయని వారికి అభివృద్ధి ఉండదని ఓపెన్ గా చెప్పే చంద్రబాబుకు.. ఎన్నికల తర్వాత అభివృద్ధే తప్పించి మరింకేమీ ప్రాధాన్యత అంశాలు ఉండవని చెప్పే జగన్ కు మధ్య పోలికే ఉండదన్నారు.
రెండు అంశాలపై విజయసాయి చేసిన ట్వీట్లను యథాతధంగా చూస్తే..
+ టీడీపీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ లో స్పందించారు. 'లక్షల కోట్ల అవినీతి బయటపడితే జీవితాంతం జైల్లోనే మగ్గాల్సి వస్తుందన్నఆందోళనతోనే చంద్రబాబు బీజేపీతో మళ్లీ సయోధ్యకు తహతహలాడుతున్నారు. ముందుగా రాజ్యసభ సభ్యులను పంపించి రూట్ క్లియర్ చేసుకుంటున్నారు. వీళ్ల ద్వారా బీజేపీ పెద్దలతో రాజీ కుదుర్చుకుని కేసుల నుంచి బయటపడే ప్లాన్.
+ టీడీపీని ఓడించినందుకే కర్నూలు జిల్లాల్లో అభివృధ్ది పనులు చేపట్టలేదని 6 నెలల క్రితం చంద్రబాబు చెప్పిన విషయం అందరికీ గుర్తుంది. ఎన్నికల తర్వాత ప్రజలంతా నావారే. ఎవరి పట్ల వివక్ష ఉండదని సీఎం జగన్ గారు స్పష్టం చేశారు. మ్యానిపులేటర్ చంద్రబాబుకు, ప్రజా నాయకుడు జగన్ గారికి తేడా ఇదే' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.