బాబు యూ ఆర్ ఔట్‌..కేటీఆర్ గెస్ క‌రెక్ట్‌

Update: 2018-12-11 12:15 GMT
తెలంగాణ‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఎంపీ విజ‌య‌ సాయి రెడ్డి ఆస‌క్తిక‌రంగా స్పందించారు. అనేక ట్వీట్ల‌లో స్పందించారు. ``తెలంగాణాలో చంద్రబాబు చక్రం అద్భుతంగా తిరిగింది. వెనక్కు పరిగెత్తుతున్న టీడీపీ సైకిల్ మీద రాహుల్ గాంధీ ఎక్కి కూర్చోవటంతో  మరింత వేగంగా ఒకటి కాదు...రెండు చక్రాలు తిరిగాయి. జాతీయ స్థాయిలో ఐరన్ లెగ్ ఎవరో దేశమంతటికీ  తెలిసిపోయింది`` అని ఆయ‌న అన్నారు. ``తెలంగాణాలో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభావం బాగా కనిపించింది. కాకపోతే అది టీఆర్ ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా - చంద్రబాబు ఎంట్రీతో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడిన ఓటుగా మారింది. దేశ రాజకీయ చరిత్రలోనే ఇదో విచిత్రం.`` అని ఎద్దేవా చేశారు.

పవిత్ర కర్తవ్యాన్ని నెరవేర్చాల్సిన పత్రికలు టీడీపీ కరపత్రాలుగా మారాయని ఈ సంద‌ర్భంగా విజ‌యసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ``ఈసీ నిబంధన ప్రకారం నియోజకవర్గంలో రూ.28 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలి. నాయుడు బాబు దాన్ని 28 కోట్లకు తీసుకు వెళ్లారు. కూకట్‌ పల్లిలో వంద కోట్లు వెదజల్లారు. ఫలితాన్ని1% కూడా మార్చలేక పోయారు. బాబూ యూ ఆర్ అవుట్`` అని ఎద్దేవా చేశారు. ``చంద్రబాబుకు లొంగిపోయిన 'ఆంధ్రా ఆక్టోపస్‌' సర్వేని పట్టుకుని 'కారు కింద భూమి కదిలిపోతోంది' - 'కూటమి సునామీ - భూకంపం ఖాయం' అంటూ పతాక శీర్షికలతో హోరెత్తించిన కుల మీడియాకు ఈరోజు పట్టిన 'చంద్ర'గ్రహణంతో మైండ్‌ బ్లాంక్‌ అయి నోరు పెగలడం లేదు.`` అని మండిప‌డ్డారు. ``తెలంగాణ ఎన్నికల్లో 'ప్రజా కూటమి' ఘోర పరాజయానికి చంద్రబాబు నైతిక బాధ్యత వహిస్తాడా లేక కాంగ్రెస్‌ పైకి నెట్టేస్తాడా? రాజకీయ సత్సంప్రదాయాలు పాటించే నాయకుడెవరైనా ఆ పని చేస్తారు.  కానీ నైతిక విలువలు - నీతి - నిబద్ధత అసల్లే లేని చంద్రబాబుకు అలాంటి ప్రజాస్వామ్య సంప్రదాయాలంటేనే గిట్టవు కదా!`` అని పేర్కొన్నారు.

``ఒకే ఒక వ్యక్తిని టార్గెట్‌ గా చేసుకుని తెలంగాణ ఓటర్లు బ్యాలెట్లతో బుల్లెట్ల వర్షం కురిపించారు. పిసరంత పనిచేసి కొండంత ప్రచారంతో రాజకీయ లబ్ది కోసం వచ్చిన “స్వయం ప్రకటిత హైద్రాబాద్ నిర్మాత" నాయుడు బాబు మళ్ళీ కనిపించకుండా పాతాళంలో స్మారక స్తూపం కట్టి వీడ్కోలు పలికారు...కసిగా!`` అని విజ‌య‌ సాయి రెడ్డి పేర్కొన్నారు. ```నమ్మితి రా నిన్ను అంటే - నట్టేట ముంచుతాను రా' అన్నట్లు నాయుడు బాబును నమ్మి 'ప్రజా కూటమి' కడితే దానిని నిలువునా  హుస్సేన్‌ సాగర్‌ లో ముంచేశాడు. రేపు 'జాతీయ కూటమి'ని కూడా ఏదోక ఏట్లో ముంచి తన సత్తా చూపడం ఖాయం. దేశంలోనే సీనియర్‌ మోస్ట్‌ పొలిటీషియన్‌ కదా మరి!`` అని వ్యాఖ్యానించారు. ``తెలంగాణ ప్రజానీకం తిరుగులేని తీర్పుతో సైకిల్‌కు ముందు చక్రం ఊడిపోయింది. నాయుడు బాబుకు చావుతప్పి కన్నులొట్టబోయింది. సైకిల్‌ వెనుక చక్రం కూడా పీకి చంద్రబాబు పీడను ఎంత త్వరగా ఒదిలించుకోలా అని ఆంధ్ర ప్రజలు కసిగా ఎదురుచూస్తున్నారు.

కేటీఆర్ చక్కగా ఎనలైజ్ చేశాడు. మీడియా - డబ్బుతో ఏదైనా చేయొచ్చన్న భ్రమలో ఉంటాడు చంద్రబాబు. ప్రజలు మిమ్మల్ని చూస్తేనే భయపడుతుంటే మీడియా - మీరు నమ్ముకున్న నోట్ల కట్టలు గెలిపించలేవు. తాచెడ్డ కోతి వనమెల్ల చెడినట్టు తెలంగాణా కాంగ్రెస్ ను నిండా ముంచుతున్నాడు పెద్ద నాయుడు.`` అని ఎద్దేవా చేశారు. మ‌రో ట్వీట్ లో సంచ‌ల‌న అంశాలు పేర్కొన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో ఓడిన ప్రముఖుల జాబితా....

1)చంద్రబాబు నాయుడు
2)బాలకృష్ణ
3)లగడపాటి రాజగోపాల్
4)ఏబీఎన్-ఆంధ్రజ్యోతి రాదాకృష్ణ
5)ఈనాడు-ఈటీవి రామోజీ
6)మునుగుతున్న చంద్రబాబు తోక పట్టుకుని ఈదటానికి ప్రయత్నించిన కాంగ్రెస్.


Tags:    

Similar News