టీడీపీపై విరుచుకుపడడంలో వైసీపీ నేతలందరిలోనూ విజయసాయిరెడ్డిది ప్రత్యేకమైన శైలి. ముఖ్యంగా ట్విటర్ వేదికగా ఆయన నిత్యం టీడీపీ అధినేత చంద్రబాబు - ఆయన కుమారుడు లోకేశ్ తో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నేతలపైనా మండిపడుతూ ఉంటారు. సునిశిత ఆరోపణలు చేయడంతో పాటు సెటైర్లు వేసి వారిని ఎండగడుతుంటారు. తాజాగా ఆయన మరోసారి చంద్రబాబు - లోకేశ్ - కోడెల శివప్రసాద్ ముగ్గురినీ కలిపి తన సెటైర్లతో ఆటాడుకున్నారు.
ఏపీ ప్రజలు వైసీపీని గెలిపించడం - జగన్ ను ముఖ్యమంత్రిని చేయడంపై ఇటీవల చంద్రబాబు మాట్లాడుతూ సెటైరిగ్గా... పాలిచ్చే ఆవును కాదని దున్నపోతును ఏపీ ప్రజలు తెచ్చుకున్నారని కామెంట్ చేశారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి చంద్రబాబు చేసిన ఆ కామెంట్లకు అదే తరహాలో కౌంటరేశారు. పాలిచ్చే ఆవు(చంద్రబాబు) - పాలు మరవని దూడ(లోకేశ్) కలిసి ఆ ‘కోడె’ల సంగతి చూడాలని విజయసాయిరెడ్డి సూచించారు.
కోడెలను చంద్రబాబు ఐదేళ్ల పాటు జనంపైకి ఆంబోతులా వదిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల గుంపు పొడిచి - తన్నని ప్రజలు మిగలలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇకనైనా ఆయన్ను దొడ్లో కట్టేయాలనీ - లేదంటే తరిమివేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
కాగా.. విజయసాయిరెడ్డి ట్వీట్ పై కోడెల అనుచరులు మండిపడుతున్నారు. కానీ.. ఇప్పటికే కోడెలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా లక్ష్యం చేసుకోవడంతో ఇప్పుడు ఏం చేసినా మరింతగా వేధింపులు తప్పవన్న ఆందోళనతో సైలెంటుగా ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి చంద్రబాబు చేసిన కామెంట్లేమో కానీ విజయసాయిరెడ్డి చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేశ్ - మాజీ స్పీకర్ కోడెలను కూడా ఉతికి ఆరేశారని వైసీపీ అభిమానులు సంబరపడిపోతున్నారు.