ఏపీ సీఎం - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై సునిశిత విమర్శలు - ఉక్కిరిబిక్కిరి అయ్యే ఆరోపణలు చేయడంలో ముందుండే వైసీపీ నేత - ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఈ దఫా ఎప్పట్లాగానే రాజకీయ అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా - ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ముడిపెట్టి టీడీపీ అధినేతను ఇరకాటంలో పడేశారు. ఆయా మతాల పవిత్ర ప్రార్థనాలయాలను సంబంధిత విశ్వాసపరులకు ఎంత ప్రీతిపాత్రమైనవో....టీడీపీ అధ్యక్షుడికి తన అవినీతి సంపాదన దాచుకునేందుకు సింగపూర్ అంత ఇష్టమైన ప్రాంతమని విజయ సాయి రెడ్డి ఆరోపించారు.
హిందువులకు తిరుపతి - కాశీ పుణ్యక్షేత్రాలని - ముస్లింలకు మక్కా పవిత్ర స్థలమని - క్రిస్టియన్లు జీవితంలో ఒక్కసారైనా జెరూసలేం వెళ్లాలనుకుంటారని.. కానీ టీడీపీ అధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబుకు సింగపూరే అత్యంత ప్రీతిపాత్రమైన పుణ్యస్థలమని విజయ సాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు మక్కా - కాశీలు లేవన్నారు. ఆయనకు ఉన్నదల్లా ఒక్క సింగపూర్ ప్రేమేనని అందుకు అవినీతి సంపాదన అక్కడ దాచుకోవడమే కారణమని విజయ సాయి రెడ్డి విమర్శించారు. చంద్రబాబు తన అక్రమ సంపాదనను సింగపూర్ తరలిస్తున్నారని ఆరోపించారు. సింగపూర్ సంస్థలకు వేల కోట్ల అమరావతి భూములను చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టిందని ఈ తతంగా వెనుక పక్కా అవినీతి ఉందని విజయ సాయి రెడ్డి ఆరోపించారు.
అవినీతిలో చంద్రబాబు కొత్త పోకడలను సృష్టించారని విజయ సాయి రెడ్డి ఆరోపించారు. సింగపూర్ లో వ్యవసాయమనేది తెలియనప్పటికీ టీడీపీ కార్యకర్తలను వ్యవసాయ శిక్షణ పేరుతో సింగపూర్‌కు జాయ్ ట్రిప్పులకు పంపిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ ఖర్చులతో ఓ మంత్రి రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ కు - మరో మంత్రి హెయిర్ డై వేయించుకునేందుకు - ఇంకో మంత్రి ఫర్నీచర్ కొనుగోలు చేసేందుకు సింగపూర్ వెళ్తారని విజయసాయి ఎద్దేవా చేశారు. ఇదంతా ఎవరి సొమ్మని ఆయన ప్రశ్నిస్తూ...బాబు ఆయన మంత్రి వర్గ సహచరుల తీరుతో ఏపీ ఖజానాకు భారం పడటమే కాకుండా రాష్ట్రం నవ్వుల పాలవుతుందన్నారు.