ఖాళీ చేయ‌కుంటే.. లింగ‌మ‌నేని రాసిచ్చిన‌ట్లే!

Update: 2019-06-27 10:12 GMT
నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా కృష్ణా న‌ది క‌ర‌క‌ట్ట‌లకు అనుకొని బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్మించిన ప్ర‌జావేదిక‌ అక్ర‌మ నిర్మాణం అన్న విష‌యంపై క్లారిటీ రావ‌ట‌మే కాదు.. దాన్ని కూల్చివేస్తూ సీఎం వైఎస్ జ‌గ‌న్ సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌ని చెప్పాలి. అక్ర‌మ నిర్మాణాల‌పై త‌మ వైఖ‌రి ఎలా ఉంటుంద‌న్న విష‌యం తాజా ఉదంతంతో జ‌గ‌న్ చెప్పేసిన‌ట్లే. అక్ర‌మ నిర్మాణ‌మైన ప్ర‌జావేదిక‌ను కూల్చివేసిన వేళ‌.. ఏపీ విప‌క్ష నేత చంద్ర‌బాబు అద్దెకు ఉండే నివాసం కూడా అక్ర‌మ‌మేన‌ని తేల్చిన త‌ర్వాత ఆయ‌న అందులోనే కొన‌సాగ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

నిబంధ‌న‌లు తూచా త‌ప్ప‌కుండా పాటించాల్సిన సీఎం.. అందుకు భిన్నంగా అక్ర‌మ నిర్మాణంలో నివాసం ఉండ‌టానికి మించిన దారుణం మ‌రింకేమీ ఉండ‌దు. త‌ప్పు తేలిపోయిన త‌ర్వాత అయినా త‌గ్గ‌క‌పోగా.. నేటికి అక్ర‌మ నిర్మాణంలో బాబు ఇంకా కొన‌సాగ‌టంపై ప‌లువురు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయి రెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొత్త పాయింట్ తెర మీద‌కు తెచ్చారు. క‌ర‌క‌ట్ట నివాసం అక్ర‌మ నిర్మాణ‌మ‌ని బాబుకు ముందే తెలుస‌ని.. ఉత్త అమాయ‌క‌త్వం న‌టిస్తున్నార‌న్నారు. ఇన్నాళ్లు ప్ర‌భుత్వం ఆ ఇంటికి అద్దె చెల్లించింద‌ని.. అద్దె ఇల్లు ఖాళీ చేయ‌టానికి బాబుకున్న అభ్యంత‌రం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ఒక‌వేళ ఇంటిని ఖాళీ చేసే విష‌యంలో బాబు నో చెబితే.. ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ లో భాగంగానే లింగ‌మ‌నేని దాన్ని రాసిచ్చిన‌ట్లుగా అనుకోవాల్సి ఉంటుంద‌న్నారు.

రూల్స్ కు భిన్నంగా ఉన్న ప్ర‌జావేదిక‌ను కూల్చేసిన నేప‌థ్యంలో.. ఆ నిర్మాణంపై విజ‌య‌సాయి రెడ్డి వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. కొత్త సందేహాల‌కు తెర తీసేలా ఉండ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌జావేదిక అనే రేకుల షెడ్డు నిర్మాణంలో సిమెంటు కంటే సినిమా సెట్టింగుల్లో వాడే ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్ ఎక్కువ‌గా వాడిన‌ట్లు క‌నిపిస్తోంద‌ని.. కోటి రూపాయిలు ఖ‌ర్చయ్యే తాత్కాలిక నిర్మాణానికి రూ.9కోట్లు ఖ‌ర్చు అయిన‌ట్లు చూపించార‌న్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో జ‌రిగిన నిర్మాణాలు అన్ని ఇలానే ఉన్నాయన్న అనుమానం క‌లుగుతుంద‌ని.. ఇదో చిన్న న‌మూనానే అంటూ కొత్త డౌట్లు తెర మీద‌కు తెచ్చారు.

బాబును ఉద్దేశించి విజ‌య‌సాయి చేసిన ట్వీట్లు య‌థాత‌ధంగా చూస్తే..

+  కరకట్ట నివాసం అక్రమ నిర్మాణమని చంద్రబాబుకు ముందే తెలిసినా అమాయకత్వం నటిస్తున్నారు. ఇన్నాళ్లు ప్రభుత్వం ఆ ఇంటికి అద్దె  చెల్లించింది. అద్దె ఇల్లు ఖాళీ చేయడానికి అభ్యంతరం ఏముంటుంది? 'చెయ్యను పో' అంటే ఇన్‌ సైడర్ ట్రేడింగులో భాగంగానే లింగమనేని దాన్ని రాసిచ్చినట్టు అనుకోవాలి.

+  చంద్రబాబు ఐదేళ్లుగా నివాసం ఉంటున్న అక్రమ నిర్మాణం లింగంనేని ఎస్టేట్ నుంచి తక్షణం ఖాళీ చేయాలి. అది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే కట్టారుగా అనే ముర్ఖపు లాజిక్కులతో తప్పించుకోలేరు. నదీ గర్భంలో నిర్మించిన భవనమని తేలాక కూల్చివేయడం తప్ప వేరే పరిష్కారమేముండదు.

+  ప్రజావేదిక అనే రేకుల షెడ్డు నిర్మాణంలో సిమెంటు కంటే సినిమా సెట్టింగుల్లో వాడే ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ నే ఎక్కువగా వాడినట్టు కనిపిస్తోంది.కోటి ఖర్చయ్యే తాత్కాలిక నిర్మాణానికి రూ.9కోట్ల ఖర్చయినట్టు చూపారు.ఇదో చిన్న నమూనానే. చంద్రబాబు హయాంలో జరిగిన నిర్మాణాలన్నీ ఇలాగే ఉంటాయనిపిస్తోంది.

+  ప్రజావేదిక షెడ్డు కూల్చివేతను చూసేందుకు వచ్చిన ప్రజలకున్న అవగాహన కూడా టీడీపీ నేతలకు లేకపోవడం దురదృష్టం. రాజధాని కోసం మా నుంచి 33 వేల ఎకరాలు సేకరించారు. ప్రజా వేదికను కరకట్టకు బదులుగా ఆ భూముల్లోనే కట్టి ఉంటే ఇవాళ ప్రజాధనం వృధా అయ్యేది కాదు కదా అని ప్రశ్నించారు.


Tags:    

Similar News