కియాపై రాయిటర్స్ కథనాల వెనుక చంద్రబాబే

Update: 2020-02-09 07:50 GMT
జాతీయ పత్రిక రాయిటర్స్   ఏపీలో 1.1 బిలియన్ డాలర్లతో నెలకొల్పిన కియా మోటార్స్ కంపెనీ తమిళనాడు తరలిపోతోందంటూ సంచలన కథనాన్ని వండి వార్చిన సంగతి తెలిసిందే.. ఏపీని, దేశాన్ని అతలాకుతలం చేసిన ఈ వార్త సంచలనమైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం కియాలో 75శాతం ఉద్యోగాలు ఇవ్వాలని పట్టుబట్టిందని.. రాష్ట్రంలో ప్లాంట్ నెలకొల్పడానికి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన వివిధ ప్రోత్సహకాలను తగ్గించిందని రాయిటర్స్ సంస్థ అభూతకల్పనలతో కథనంలో ఆరోపించింది.  ఏపీలోని వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, అల్లకల్లోలం చేయడానికి రాయిటర్స్ సంస్థ రాసిన ఈ వార్త కారణమైంది. స్వయంగా జగన్ సర్కారు రంగంలోకి దిగి ఈ వార్తను ఖండించి కియా మోటార్స్ చేతే అలాంటిదేమీ లేదని వివరణ ఇప్పించింది. దీంతో రాయిటర్స్ కుట్ర బట్టబయలైంది.

తాజాగా ఈ వివాదంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ‘రాయిటర్స్’ తప్పుడు కథనం వెనుకున్నది టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అని ఆయన ఆరోపించారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ ‘‘ఆఖరికి అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్‌ను కూడా మేనేజ్‌ చేసి కియా కార్ల ఫ్యాక్టరీ తరలిపోతుందంటూ వార్త రాయించి పుకార్లు లేవదీశాడు. సీఎంగా ఉండగా ప్రజాధనంతో ఆ సంస్థకు ప్రయోజనాలు కల్పించి ఇప్పుడు ప్రభుత్వంపైకి ఉసిగొల్పుతున్నాడు. అన్ని వ్యవస్థలతో పాటూ మీడియాను భ్రష్టు పట్టించాడు.’’ అంటూ చంద్రబాబుపై పరోక్షంగా సంచలన ఆరోపణలు చేశారు.


Tags:    

Similar News