అసలు విషయం చెప్పకుండా..ఈ లొల్లి ఏంటి కేసీఆర్?

Update: 2019-12-02 12:25 GMT
తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌ పర్సన్ విజయశాంతి  వీలుచిక్కినప్పుడల్లా సీఎం కేసీఆర్ పై విరుచుకుపడుతుంటారు. తాజాగా మరోసారి దిశా ఉందంతం పై సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యింది. హుజూర్ నగర్ ఎన్నికలలో గెలిచిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన సీఎం కేసీఆర్ ..దిశా ఉదంతం పై మూడు రోజుల తీరికగా ఎదో మొక్కుబడి ప్రకటన చేసి చేతులు దులుపుకున్నాడని తెలిపారు.  అది కూడా మహిళా సంఘాలు నిలదీసిన తర్వాత, జాతీయ మీడియా ఏకిపారేసిన తర్వాత ఒక ప్రకటన చేయడం సిగ్గు చేటు అని - ఈ మాటేదో వరంగల్లో మానస హత్యాచారానికి గురైన వెంటనే కానీ -  వెటర్నరీ డాక్టర్‌ ను సజీవ దహనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన రోజే చెప్పి ఉంటే దానికి విలువ ఉండేదన్నారు.

ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు శిక్ష వేయిస్తాం అని చెప్తున్న కేసీఆర్ - వెటర్నరీ డాక్టర్ కనిపించలేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌ కి వెళితే బాధ్యతారహితంగా మాట్లాడిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పలేదు అని - ఇలాంటి దారుణ ఘటనలపై ఫిర్యాదు అందిన వెంటనే పరిధుల పేరుతో జాప్యం చేయకుండా పోలీసులకు ఎలాంటి ఆదేశాలు ఇస్తారని కేసీఆర్ ప్రకటించలేదని  విమర్శించారు. అలాగే ఈ ఒక్క విషయాంలోనే కాదు గతంలో ఆర్టీసీ సమ్మె విషయంలో కూడా కేసీఆర్ వ్యవహార తీరు ఏమాత్రం బాగాలేదు అని అన్నారు. ఇప్పుడు చేసిన ప్రకటన ఎదో ..హై కోర్ట్ చెప్పినప్పుడు ఎందుకు చేయలేదు అని ప్రశ్నించింది. ఆర్టీసీని కాపాడాలనే నిర్ణయం తీసుకునేందుకు రెండు నెలల సమయం ఎందుకు పట్టిందన్నారు. ప్రగతి భవన్‌ లో పెంచుకున్న పెంపుడు కుక్కకు ఇచ్చిన విలువ కూడా తెలంగాణ ప్రజానీకానికి కేసీఆర్ ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయని విమర్శించారు. 


Tags:    

Similar News