తమిళనాడులో రజనీకాంత్ తర్వాత అత్యంత భారీ ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తున్న హీరోగా దళపతి విజయ్ కి పేరుంది. అయితే అతడు సినీప్రపంచాన్ని వీడి రాజకీయాల్లోకి ప్రవేశించే సమయమాసన్నమైందని వారంతా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజయ్ అభిమానులు ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని నాయకుడిగా రాష్ట్రంలో సానుకూల మార్పు తీసుకురావాలని కలలు కంటున్నారు. ఇక విజయ్ కూడా ఆ దిశగానే వెళ్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ తన రాజకీయ ప్రయాణంపై దృష్టి పెట్టేందుకు సినిమాల నుంచి తప్పుకుంటాడని ఇటీవల ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే తమిళ మీడియా సర్కిల్స్ లో తాజా కథనాలు ఇలా ఉంటే... దళపతి విజయ్ సినిమా ప్రపంచానికి శాశ్వతంగా వీడ్కోలు పలకడని.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి68 చిత్రీకరణను పూర్తి చేసిన వెంటనే కేవలం మూడేళ్ల పాటు సినిమాలకు విరామం తీసుకుంటాడని తెలుస్తోంది. ఈ సమయంలో విజయ్ తన అభిమానులను కార్యకర్తలుగా మార్చి తన రాజకీయ ఆకాంక్షలపై పని చేస్తాడు. తను ప్రారంభించబోయే రాజకీయ సంస్థను అట్టడుగు స్థాయి నుండి బలోపేతం చేస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే విజయ్ సొంత పార్టీని ప్రారంభిస్తారా లేదా తమిళనాడులో ఉన్న ఏదైనా రాజకీయ పార్టీలో చేరతారా అనేది వేచి చూడాలి. 2024లో సస్పెన్స్ కి తెర దించే ఛాన్సుందని గుసగుస వినిపిస్తోంది. అయితే దళపతి పొలిటికల్ ఎంట్రీ గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతానికి తమిళ మీడియాలో ఊహాజనిత కథనాలు వరుసగా వెలువడుతున్నాయి.