వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, పార్టీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి రెండో రోజు కూడా సవాల్ విసిరారు. అయితే ఈ దఫా తెలుగుదేశం పార్టీ నేతలకు కాకుండా ఏకంగా పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకే చాలెంజ్ ప్రతిపాదించారు. కేంద్రంతో ఎవరు లాలూచి పడుతున్నారో బహిరంగంగా చర్చించేందుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకువిజయసాయిరెడ్డి సవాల్ విసిరారు. తనపై ఉన్న కేసుల విచారణ జరుగకుండా కోర్టుల నుంచి స్టే తెచ్చుకుని, నాలుగేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీతో లాలూచీ రాజకీయాలు జరిపిన చంద్రబాబునాయుడి వైఖరిని ఏపీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.
పార్లమెంట్ వద్ద వైఎస్ ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనను ఉద్దేశించి టీడీపీ సీఎం రమేష్ చేసిన సవాల్ ను ప్రస్తావించారు. ఇప్పటికే తాను రమేష్‌కు చాలెంజ్ కు స్పందించానని అయితే ఇప్పుడు ఆయన కాకుండా చంద్రబాబుకే సవాల్ విసురుతున్నానని విజయసాయిరెడ్డి తెలిపారు. కేంద్రంతో ఎవరు లాలూచీ పడుతున్నారో, బహిరంగ వేదికపై చర్చకు సిద్ధమని చంద్రబాబు ఇందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని - సమయం - ప్రాంతం చంద్రబాబే డిసైడ్ చేసుకోవచ్చని అన్నారు. న్యాయ నిపుణులు - రాజకీయ పార్టీల ప్రతినిధులను పిలిచి, వారి మధ్య చర్చించేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు.
వైఎస్ చౌదరి ఒక నేరస్థుడని - బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టిన ఆర్ధిక నేరగాడు సుజనా చౌదరని విజయసాయిరెడ్డి విమర్శించారు. బ్యాంకులు దెబ్బతినడానికి కారకుడు సుజనా చౌదరని అలాంటి వ్యక్తులు మా మీద ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. ఇద్దరు నేరగాళ్లు సుజనా - సీఎం రమేష్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ని ఎందుకు కలిశారని ఆయన ప్రశ్నించారు. అందితే కాళ్ళు - అందకపోతే జుట్టు అన్నట్టు వ్యవహరించేది చంద్రబాబు - ఆయన ఎంపీలు - ఎమ్మెల్యేలని విజయసాయి ఎద్దేవా చేశారు.