రాజీనామా చేసే రావాలి.. సాయిరెడ్డి వ్యాఖ్య‌ల వెనుక‌!?

Update: 2020-10-03 17:30 GMT
రాజ‌కీయాల్లో నాయ‌కులు ఎప్పుడు ఏం మాట్లాడినా.. సంచ‌ల‌న‌మే అవుతుంది. మ‌రీ ముఖ్యంగా అధికార పార్టీ నేత‌లు పెద‌వి విప్పితే.. రాజ‌కీయంగా ప్రాధ‌న్యం మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా వైసీపీ నాయ‌కుడు, వ్యూహ‌క‌ర్త‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డి చేసిన కొన్ని కామెంట్లు కూడా రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించాయి. తాజాగా ఆయ‌న వైసీపీ రాజ‌కీయ లైన్ గురించి మాట్టాడారు. ప్ర‌తిప‌క్షం టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు వైసీపీలోకి వ‌చ్చేందుకు రెడీగా ఉన్నార‌ని చెప్పిన ఆయ‌న .. ఎవ‌రు పార్టీలోకి వ‌చ్చినా.. పార్టీ సిద్ధాంతాల‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌న్నారు.

స‌రే! ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. సిద్ధాంతాల‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌నేది వాస్త‌వ‌మే. కానీ, ఎన్న‌డూ లేనిది.. ఇప్పుడు హ‌ఠాత్తుగా సాయిరెడ్డి ఇలా సిద్ధాంతాల‌ను ఎందుకు గుర్తు చేశారా? అనేది పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. రాజ‌కీయంగా ప్ర‌తిపార్టీకీ సిద్ధాంతాలు ఉన్నాయి. అదేస‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ అసెంబ్లీలోనే చెప్పిన‌ట్టు.. త‌న పార్టీలోకిఎవ‌రు రావాల‌న్నా.. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాలి. లేదా.. అలా కాకుండా వ‌చ్చేవారిపై స్పీక‌ర్‌గా త‌మ్మినేని సీతారాంకు స‌ర్వ‌హ‌క్కులు ఉన్నాయి. ఈ విష‌యం కొత్త‌కాదు. కానీ, ఇప్పుడు సాయిరెడ్డి చెప్ప‌డ‌మే వ్యూహాత్మ‌కంగా ఉంద‌ని అంటున్నారు.
Tags:    

Similar News