ఏపీలో నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికల మీద గడిచిన కొద్ది కాలంగా ప్రభుత్వం.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య నడుస్తున్న పంచాయితీ తెలిసిందే. ఎన్నికల్ని నిర్వహించటానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నా.. కరోనా నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించటం సరికాదని ప్రభుత్వం చెబుతోంది. ఈ అంశం రాష్ట్ర హైకోర్టులో ఉంది. ఇదిలా ఉండగా..స్థానిక ఎన్నికలపై వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు.. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు.
ప్రస్తుతం శ్రీకాకుళం పర్యటనలో ఉన్న ఆయన.. స్థానిక ఎన్నికల గురించి మాట్లాడుతూ.. ఏప్రిల్.. మే లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నిక పూర్తి అయిన తర్వాత స్థానిక ఎన్నికలు జరుగుతాయని తమ పార్టీ విశ్వసిస్తోందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలు పూర్తి అయిన తర్వాత జులైలో పార్టీ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహిస్తారన్నారు.
శ్రీకాకుళంలోని స్థానిక పార్టీ కార్యాలయంలోకార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో.. స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది.. ఎప్పుడు నిర్వహించాలనుకున్నదన్న విషయంపై స్పష్టత వచ్చిందని చెప్పాలి. ఎన్నికల తర్వాత నిర్వహించే పార్టీ ప్లీనరీని ఈసారి ఉత్తరాంధ్రలో నిర్వహించనున్నట్లుగా విజయసాయి పేర్కొన్నారు. జులై 8న ప్లీనరీని నిర్వహిస్తామని చెప్పారు. తాజా పరిణామాల్ని చూస్తే.. విశాఖను రాజధానిగా ఎంపిక చేసిన నేపథ్యంలో.. ప్లీనరీ వేదికను ఉత్తరాంధ్రగా డిసైడ్ చేసినట్లు చెబుతున్నారు.